ఆర్జీవీ లెటర్ కి పవన్ ఫ్యాన్స్ కౌంటర్ 

RGV

కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ,పవన్ కళ్యాణ్ ట్వీట్లకి స్పందిస్తూ ఒక చిన్న లెటర్ రాసాడు. అందులో ముఖ్యంగా  పవన్ కళ్యాణ్ ఇది అంతా సానుభూతి కోసం చేస్తున్న డ్రామా అని చెప్పుకొచ్చారు.
“ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్  వ్యక్తి  తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా?” అని ఆర్జీవీ అన్నారు.
చంద్రబాబు దీక్ష కుడా ఒక దీక్షేనా , నిరాహార దీక్ష ఎక్కడైనా 12 గంటలు చేస్తూ స్పెషల్ స్టేటస్ కోసం ఒక్క రోజు బందులు, ఒక్క రోజు  దీక్షలు ఎంత వరకు  కరెక్ట్ అని పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
“మీడియాలో మీటింగ్లు  బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇచ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ” :ఆర్జీవీ
నాగ బాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ  అందరూ కోరుకున్నట్టే  కమిటీ ఒకటి పెడ్తున్నాము..ఇంకా ఇది అంతా ఇక్కడితో ఆగిపోవాలి. తమ్ముడు భరిస్తున్నాడు అంటే బయపడి కాదు బలవంతుడు కాబట్టి, మా ఫామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని అప్పుడే హెచ్చరించారు కానీ టీవీ చానెల్స్ ఆపకుండా అదే టెలికాస్ట్ చేయడం తో  పవన్ కళ్యాణ్ అన్ని ప్రూఫ్స్ తో అందరి బండారం బయటపెట్టారు అని విశ్వనియ  వర్గాల సమాచారం.
పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ కి కొత్తగా చీప్ పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరంలేదు. నిజా నిజాలు బయట పెట్టడమే పవన్ ఉదేశం, మీడియా ముసుగులో ప్రజలకి స్వచ్ఛమైన న్యూస్ చెప్పకుండా అనవసరమైన న్యూస్లు డబ్బులకి అమ్ముడుబోయి జర్నలిజం పరువు తీస్తున్నారని ఆర్జీవీ రాసిన లెటర్ కి  ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here