ఇలాంటి సినిమా అవ‌స‌ర‌మా త‌రుణ్..?


.మిలీనియం మొద‌ట్లో తెలుగు ఇండ‌స్ట్రీకి దూసుకొచ్చిన బాణం త‌రుణ్. నువ్వే కావాలి అంటూ ప్రేక్ష‌కుల‌తో అనిపించుకున్నాడు త‌రుణ్. త‌ర్వాత నువ్వు లేకే మేము లేమంటూ ప్రియ‌మైన నీకు అంటూ ఎంద‌రో అమ్మాయిల‌కు నిద్ర లేకుండా చేసాడు ఈ ల‌వ‌ర్ బాయ్. అస‌లు మ‌హేశ్, ఎన్టీఆర్ లాంటి హీరోలెవ‌రూ స్టార్స్ కాక‌ముందే త‌రుణ్ స్టార్. కానీ ఇదంతా ఇప్పుడు కాదు. గ‌త‌మే.. అప్పుడెప్పుడో 12 ఏళ్ల కింద గ‌తం ఇదంతా. 2000 త‌ర్వాత ఐదారేళ్ల పాటు త‌న సినిమాల‌తో ఊపేసాడు త‌రుణ్. ఈయ‌న సినిమా వ‌స్తుందంటే యూత్ కు పండ‌గే. అంత‌గా త‌రుణ్ మాయ చేసేవాడు. అప్ప‌ట్లో ఈ కుర్ర హీరోకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ‌గా ఉండేది. అంతెందుకు ఇండ‌స్ట్రీలోనే చాలా మంది హీరోయిన్లు త‌రుణ్ తో ల‌వ్ లో ప‌డ్డార‌నే వార్త‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి.
ప్రియ‌మైన నీకు, నువ్వులేక నేనులేను లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత అదే టెంపో మెయింటేన్ చేయ‌లేక కెరీర్ లో వెన‌క‌బ‌డి పోయాడు త‌రుణ్. ఉద‌య్ కిర‌ణ్ తో పాటే వ‌చ్చి అంతే వేగంగా కెరీర్ లో వెన‌కబ‌డిపోయాడు ఈ హీరో. అస‌లు త‌రుణ్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యాన్నే ఇప్పుడు మ‌ర్చిపోయారు ప్రేక్ష‌కులు. ఇలాంటి టైమ్ లో ఇది నా ల‌వ్ స్టోరీ అంటూ వ‌చ్చాడు త‌రుణ్. ఈ సినిమా వ‌స్తున్న‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు వ‌చ్చినా కూడా ఎవ‌రికీ తెలియ‌దు. నిజానికి ఇలాంటి సినిమా చేసేకంటే కూడా కామ్ గా ఉండుంటే బాగున్ను అంటున్నారు త‌రుణ్ ను అప్ప‌ట్లో అభిమానించిన వాళ్లు. అస‌లు త‌లతోక లేని సినిమా చేయ‌డం కంటే ఖాళీగా ఉండ‌ట‌మే మంచిదంటున్నారు వాళ్లు. ఆర్నెళ్ల పాటు ప్ర‌స‌వ వేద‌న ప‌డి వ‌చ్చిన ఇది నా ల‌వ్ స్టోరీ తొలిరోజే చాలా థియేట‌ర్స్ నుంచి ఖాళీ అయిపోయింది. మొత్తానికి ఈ దెబ్బ‌తో త‌రుణ్ మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం కూడా మానేస్తాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here