ఎంసిఏ.. ర‌చ్చో ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్యః..

ఇప్పుడు ఎంసిఏ సినిమా విష‌యంలో ఇదే సరైన ప‌దం అనుకుంటా. లేక‌పోతే మ‌రేంటి.. నాని లాంటి మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ రిలీజ్ ఏంటో అర్థం కావ‌ట్లేదు. ఈ రిలీజ్ చూస్తుంటే నిజంగా నానిని మీడియం రేంజ్ హీరో అనాలంటే మ‌న‌సు రాదు. అస‌లు లెక్క‌ల ప‌రంగా చూస్తే ఎంసిఏ స్టార్ హీరోలతో స‌మానంగా విడుద‌ల‌వుతుంది. ఒక్క హైద‌రాబాద్ లోనే ఈ చిత్రం 103 థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందంటే అర్థం చేసుకోండి నాని రేంజ్ ఏ రేంజ్ లో ఉందో..? ఈ సినిమాతో చాలా రికార్డుల‌కు చెక్ పెట్ట‌డానికి చూస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్ప‌టికే వ‌ర‌స‌గా ఏడు విజ‌యాలు అందుకున్నాడు నాని. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంత వ‌ర‌స‌గా విజ‌యాలు అందుక‌న్న హీరో మ‌రొక‌రు లేరు. ఇక ఇప్పుడు ఎంసిఏతో వ‌ర‌స‌గా ఎనిమిదో విజ‌యం ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తున్నాడు. ఇదే జ‌రిగితే ట్రిపుల్ హ్యాట్రిక్ కు మ‌రో అడుగు దూరంలోనే ఉంటాడు నాని. ఇది నిజంగా ఓ చ‌రిత్రే.
ఈ ఏడాది ఇప్ప‌టికే నేనులోక‌ల్.. నిన్నుకోరితో ఇప్ప‌టికే రెండు భారీ విజ‌యాలు అందుకున్నాడు నాని. ఓవ‌ర్సీస్ లోనూ ఈ రెండూ మిలియ‌న్ మార్క్ దాటాయి. ఇక ఇప్పుడు ఎంసిఏతో మూడో హిట్ కు రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన 150 లొకేష‌న్స్ ను ఇప్పుడు నాని కూడా అందుకున్నాడు. అంటే ఈ లెక్క‌న నాని కూడా స్టార్ అయిపోయాడ‌న్న‌మాట‌. మ‌రోవైపు సినిమాపై ఉన్న బ‌జ్ చూస్తుంటే క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఎమోష‌న్స్ ను ప‌క్కాగా క్యారీ చేస్తూ వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. దిల్ రాజు నిర్మాత‌. డిసెంబ‌ర్ 21న‌ ఎంసిఏ విడుద‌ల కానుంది. మొత్తానికి చూడాలిక‌.. నాని ఎంసిఏతో ఏ మ్యాజిక్ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here