కుర్రాడి హ్యాట్రిక్ ఆశ‌లు గ‌ల్లంతు..


వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకోవ‌డం అనేది చిన్న విష‌యం కాదు. ఇక ద‌ర్శ‌కుల‌కు అయితే అది క‌ల‌.. అది కూడా తొలి మూడు సినిమాల‌తోనే హిట్లు కొట్ట‌డం అనేది ఈజీ కాదు. చాలా త‌క్కువ మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే ఇది సాధించారు. ఈ మ‌ధ్య కాలంలో రాజ‌మౌళి త‌ర్వాత బోయ‌పాటి శీను.. కొర‌టాల శివ‌.. అనిల్ రావిపూడి మాత్ర‌మే హ్యాట్రిక్ పూర్తి చేసారు.
ఈ అవకాశం క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ముందు నిలిచింది. ఈయ‌న తొలి రెండు చిత్రాలు సోగ్గాడే చిన్నినాయ‌నా.. రారండోయ్ వేడుక చూద్దాం మంచి విజ‌యం సాధించాయి. లాభాల ప‌రంగా పెద్ద హిట్లే. దాంతో మూడో సినిమా నేల‌టికెట్ పై కూడా అంచ‌నాలు భారీగానే పెరిగిపోయాయి. దానికితోడు ర‌వితేజ హీరో కావ‌డం.. ప‌క్కా మాస్ సినిమా కావ‌డంతో కుర్రాడు హ్యాట్రిక్ కొట్టేసాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సీన్ అంతా రివ‌ర్స్ అయిపోయింది.
నిజంగానే నేల‌టికెట్ ఉన్న‌ప్ప‌టి రోజుల్లో క‌థ తీసుకొచ్చి ఇప్పుడు సినిమా చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో తొలి రోజు మార్నింగ్ షో నుంచే సినిమాకు టాక్ నెగిటివ్ గా వ‌చ్చేసింది. దానికి తోడు ర‌వితేజ కూడా ఫామ్ లో లేక‌పోవ‌డంతో ఈ చిత్ర ఫ‌లితంపై అప్పుడే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇది చూసిన త‌ర్వాత క‌ళ్యాణ్ హ్యాట్రిక్ ఆశ‌లు కూడా గ‌ల్లంతైపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here