జనవరి 25న ‘దండుపాళ్యం 3’

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం’ తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన ‘దండుపాళ్యం2’ కూడా రెండు భాషల్లోనూ సూపర్‌హిట్‌ అయింది. ‘దండుపాళ్యం’ సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అన్నారు. ‘దండుపాళ్యం3’ ట్రైలర్‌ విడుదల
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ”ఈరోజు ట్రైలర్‌ విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: రవిచంద్రన్‌, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here