త‌మిళ అర్జున్ రెడ్డి ఎలా ఉన్నాడో తెలుసా..?


తెలుగులో అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్ట‌ర్. అలాంటి సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు అంటూ దానికి ఆ పేరు ఇచ్చేసారు క్రిటిక్స్. ప్రేక్ష‌కులు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు ఈ సినిమాను. విమ‌ర్శ‌లు వ‌చ్చినా విజ‌యం కూడా అదే రేంజ్ లో వ‌చ్చింది. అర్జున్ రెడ్డి అనేది ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్ అంతే. విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్ష‌న్ ఈ సినిమాకు ప్రాణం. యావ‌రేజ్ సినిమాల‌నే రీమేక్ చేస్తుంటారు.. మ‌రి ఇంత‌టి సంచ‌ల‌నం సృష్టించిన సినిమాను మాత్రం ఎందుకు వ‌దిలేస్తారు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఈ సినిమాను ఇటు త‌మిళ‌.. అటు హిందీ భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారిప్పుడు. త‌మిళ్ అర్జున్ రెడ్డిగా విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ న‌టిస్తున్నాడు. అక్క‌డ ఈ సినిమాకు వ‌ర్మ అని  పెట్టాడు ద‌ర్శ‌కుడు బాల‌.
3.5 కోట్ల‌తో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి.. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ చిత్ర త‌మిళ రీమేక్లో ముందు ధ‌నుష్ న‌టిస్తాడ‌నే వార్త‌లొచ్చాయి. కానీ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ లైన్ లోకి వ‌చ్చాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు అర్జున్ రెడ్డిగా మార‌డానికి చాలా ప్ర‌య త్నాలే చేస్తున్నాడు. ఇప్ప‌టికే గ‌డ్డం పెంచేసాడు.. ర‌ఫ్ లుక్ లోకి మారిపోయాడు.. అత‌డికి ఇప్పుడు అర్జున్ రెడ్డి బాగా పూనాడు. ధృవ్ ఈ రీమేక్ తోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి అడుగు పెడుతున్నాడు. దీని షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పిచ్చెక్కిస్తుంది. బాల తెర‌కెక్కిస్తుండ‌టంతో వ‌ర్మ‌పై అంచ‌నాలు ఇంకా పెరిగిపోయాయి. అర్జున్ రెడ్డి రెగ్యుల‌ర్ సినిమా కాదు. ఇందులో చాలా డేరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని త‌ట్టుకుని చేస్తే ధృవ్ కు మంచి ప్లాట్ ఫాం ప‌డిన‌ట్లే. మొత్తానికి తండ్రి మాదిరే తొలి సినిమాతోనే ఛాలెంజ్ లు తీసుకుంటున్నాడు ధృవ్ కృష్ణ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here