ఐదేళ్లలో మారిపోయిన విజయ్ దేవరకొండ జీవితం..

నాలుగేళ్ల కింద బ్యాంక్ అకౌంట్ లో 500 రూపాయలు ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఇండియాలో టాప్ సెలబ్రిటీస్ లో ఒకడిగా నిలిచాడు. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి పోర్ట్స్ లిస్టులో టాప్ 30 లో చోటు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇది చిన్న విషయం కాదు.. ఇండియా మొత్తంలో టాప్-30లో ప్లేస్ అందుకోవడం అనేది ఒక అరుదైన విషయం. ఇప్పుడు ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ.

నాలుగేళ్ల కిందట ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లో 500 రూపాయలు ఉండేవని.. అది క్లోజ్ కాకుండా ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ 500 మెయింటెన్ చేయాల్సి వచ్చేదని చెప్పాడు. కాలచక్రంలో నాలుగేళ్ల తర్వాత 30 ఏళ్ళ కంటే తక్కువగా ఉండి ఇండియాలో టాప్ సెలబ్రిటీస్ లో నిలిచాను.. గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈయన విజయ పరంపరను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

పెళ్లి చూపులు సినిమా లో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయాడు. గీత గోవిందం, టాక్సీ వాలా సినిమాలతో సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈయన డేట్స్ కోసం అగ్ర నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. మొత్తానికి ఐదేళ్లలో జీవితం మారిపోవడం అంటే ఇదే మరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దూకుడు చూస్తుంటే మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకుపోయేలా కనిపిస్తున్నాడు.

vijay Deverakonda New Stylish Looks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here