దేవుడా.. సాయిధ‌రంతేజ్ ఇంకోటి..!


ఒక్క ఫ్లాప్ వ‌స్తేనే ఈ రోజుల్లో హీరోను ప‌ట్టించుకోవ‌డం క‌ష్టం. స్టార్ అయితే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ చిన్న హీరోల‌కు రెండు మూడు వ‌రస ఫ్లాపులు వ‌స్తే కెరీర్ ముగిసిపోయిన‌ట్లే. కానీ సాయిధ‌రంతేజ్ విష‌యంలో ఇది జ‌ర‌గ‌డం లేదు. ఈయ‌న‌కు వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు వ‌చ్చాయి. 2015లో వ‌చ్చిన సుప్రీమ్ త‌ర్వాత సాయికి హిట్ లేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన విన్న‌ర్.. న‌క్ష‌త్రం.. జ‌వాన్..
ఇంటిలిజెంట్ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఇలా ఉన్నా కూడా ఇప్ప‌టికీ ఈయ‌న కెరీర్ కు వ‌చ్చిన స‌మ‌స్యేం లేదు. ఇప్ప‌టికీ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు తేజ్. ప్ర‌స్తుతం క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తేజ్ ఐ ల‌వ్ యు చేస్తున్నాడు ఈ హీరో. ఇది రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. ఇక ఇది సెట్స్ పై ఉండ‌గానే గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమాకి సై అన్నాడు. ఇది మెడిక‌ల్ మాఫియా చుట్టూ తిరిగే క‌థ‌. విన్న‌ర్ ఫ్లాప్ అయినా క‌థ‌పై న‌మ్మ‌కంతో మ‌రో ఆఫ‌ర్ ఇస్తున్నాడు సాయిధ‌రంతేజ్.
ఇక ఇప్పుడు వెంకీ కుడుముల కూడా సాయిధ‌రంతేజ్ తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఛ‌లో త‌ర్వాత ఈ కుర్రాడికి డిమాండ్ బాగానే పెరిగిపోయింది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. క‌నీసం ఇప్ప‌ట్నుంచైనా సాయి త‌న కెరీర్ ను గాడిన పెట్టుకుంటాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here