నాతో రాజ‌కీయాలు వ‌ద్దంటున్న క‌ళ్యాణ్ రామ్..

MLA Trailer
నేనింకా రాజ‌కీయాలు చేయ‌డం మొద‌లుపెట్ట‌లేదు.. చేస్తే మీకు చేయ‌డానికి ఏం ఉండ‌వు.. ఇంత ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ తో ర‌చ్చ చేసాడు క‌ళ్యాణ్ రామ్. ఎమ్మెల్యే సినిమాతో మార్చ్ 23న రాబోతున్నాడు ఈ హీరో. ఇందులో మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయిగా న‌టిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఈ మ‌ధ్యే సెన్సార్ కూడా పూర్తయింది. యు బై ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చింది బోర్డ్. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుందో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. సినిమా అచ్చంగా ప‌టాస్ త‌ర‌హాలోనే ప‌క్కా ఎంట‌ర్ టైనింగ్ గా ఉండబోతుంద‌ని అర్థ‌మైపోయింది. పైగా ఈ చిత్రంలో రాజ‌కీయాలు కూడా ఉన్నాయి. ఓ రాజ‌కీయ నాయ‌కుడితో స‌వాల్ చేసి ఎమ్మెల్యేగా ఓ సాధార‌ణ కుర్రాడు ఎలా గెలిచాడు అనేది అస‌లు క‌థ‌. ఇందులో విద్యావ్య‌వ‌స్థ గురించి కూడా డిస్క‌స్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్. మొత్తానికి అన్ని హంగుల‌తో మార్చ్ 23న వ‌చ్చేస్తు న్నాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి ఈయ‌న చేయ‌బోయే రాజ‌కీయాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here