నా పేరు సూర్య బిజినెస్ అదుర్స్

Naa Peru Surya Naa Illu India
ఈ మ‌ధ్య ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్నా.. 100 కోట్ల వ్యాపారం ఈజీగా జ‌రుగుతుంది. శాటిలైట్ రైట్స్ తో క‌లిపి 120 కోట్ల‌కు కూడా చేరిపోతుంది. మొన్న వ‌చ్చిన రంగ‌స్థ‌లంకు థియెట్రిక‌ల్ బిజినెస్ 80 కోట్లైతే.. శాటిలైట్ మిగిలిన రైట్స్ తో క‌లిపి 112 కోట్లైంది. ఇక భ‌ర‌త్ అనే నేను కూడా కేవ‌లం బ‌య్య‌ర్లు మాత్ర‌మే 100 కోట్ల‌కు కొన్నారు.
అంతా లెక్క‌లు క‌లిపితే 125 కోట్ల‌కు పైగానే అమ్మారు. ఇప్పుడు వంతు అల్లు అర్జున్ ది. ఈయ‌న నా పేరు సూర్య బిజినెస్ కు కూడా రెక్క‌లొచ్చేసాయి. వ‌క్కంతం వంశీకి ఇది తొలి సినిమానే అయినా కూడా బ‌న్నీపై ఉన్న న‌మ్మ‌కంతో.. ఆయ‌న మార్కెట్ పై ఉన్న ధైర్యంతో గుడ్డిగా ముందడుగేస్తున్నారు బ‌య్య‌ర్లు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 81 కోట్ల‌కు ఈ చిత్రాన్ని కొనేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ స‌రైనోడుకు వ‌చ్చింది 75 కోట్లు.
ఇప్పుడు దానికంటే ఆరు కోట్లు ఎక్కువ‌కే నా పేరు సూర్య‌ను కొన్నారు బ‌య్య‌ర్లు. అంటే అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప అంతా వెన‌క్కి రాద‌న్న‌మాట‌. సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తే కానీ ప్ర‌తీ బ‌య్య‌ర్ సేఫ్ కాడు. గ‌తంలో డిజేకు కూడా హై రేట్ల‌తో అమ్మిన కార‌ణంగానే 72 కోట్లు వ‌చ్చినా కూడా యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగాల్సి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు నా పేరు సూర్య ఏం చేస్తాడో..? ఈ చిత్రం మే 4న దాస‌రి జ‌యంతి రోజు విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. బ‌న్నీ ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here