రూప వైట్ల ‘వేదిక్ డైరీ’ ప్రారంభించిన కాజల్ అగర్వాల్

దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వైట్ల వేదిక్ డైరీ అనే సంస్ధను ప్రారంభించారు. వేదిక్ డైరీ ద్వారా సాంప్రదాయ పద్దతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నారు. మొదటి దశలో అరుదైన గిర్ జాతి ఆవుల పాలను సరఫరా చేయనున్నారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా నేడు వేదిక్ డైరీ ప్రారంభమైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ…పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమైన పాలు మరియు పాల ఉత్పత్తులను అందచేసే ప్రయత్నంగా వేదిక్ డైరీ ప్రారంభించనట్లు చెప్పారు రూప వైట్ల. తమ వేదిక్ డైరీని ప్రారంభించిన కాజల్ అగర్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here