బి.వి.ఎస్.రవి చేసింది తప్పు కానప్పుడు ఇది తప్పేలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు

జవాన్ చిత్రం శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కథ కొత్తగా బాగానే ఉన్న, కథనం మరియు దర్శకత్వ లోపాల వల్ల చిత్రానికి అనుకున్నంత స్పందన రావట్లేదు. ఇదిలా ఉండగా జవాన్ చిత్రం పైరసీ నిర్మాతలను కలవర పెడుతుంది. జవాన్ హెచ్.డి. ప్రింట్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. వోల్వో బస్సుల్లో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని వార్త. దీని పై ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దర్శకుడు బి.వి.ఎస్.రవి మండిపడ్డారు.

తను రెండు సంవత్సరాలు కష్టపడి కథ రాసుకొని, పెద్ద హీరో తో, కొన్ని నెలలు వివిధ సాంకేతిక వర్గాల వారు శ్రమించి, నిర్మాతలు బోలెడంత డబ్బు వెచ్చించి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభవం మిగల్చాలని తపన పడి చిత్రం తీస్తే, విడుదలైన రాత్రికే పైరసీ ప్రింట్ వచ్చేయడం చాల దారుణం అని. నోటిలో ముద్ద పెట్టి, గొంతు కోసేసినట్లుందని ఆవేదన వ్యక్తపరిచారు బి.వి.ఎస్.రవి.

అయితే ఫిలిం నగర్ లో దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బి వి ఎస్ రవి కొత్త కథ ఏమి రాయలేదని, కొన్ని హాలీవుడ్ చిత్రాలను కాపీ కొట్టి తీసారని అది తప్పు కానప్పుడు పైరసీ తప్పేలవుతుందని ప్రశ్నిస్తున్నారు. అక్కడి తో ఆగకుండా, బి.వి.ఎస్.రవి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో దొరిగిన విషయాన్నీ గుర్తుచేస్తున్నారు. తాగి కార్ నడుపుతూ ప్రమాదం జరిగే అవకాశముందని ఆయనకు తెలియదా, అంతకంటే పైరసీ పెద్ద నేరమా అని అడుగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here