భాగ‌మ‌తి.. వ‌సూళ్ల‌తో పోతుంది మ‌తి..!

Bhaagamathie
మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కలెక్ష‌న్లు ఎప్పుడూ త‌క్కువ‌గానే ఉంటాయి. హీరోల‌తో పోలిస్తే వాళ్ల ఇమేజ్ ను స‌రిచేయ‌డం అంత ఈజీ కాదు. కానీ అనుష్క మాత్రం తాను సూప‌ర్ స్టార్ అని మ‌రోసారి నిరూపించుకుంది. లేడీ సూప‌ర్ స్టార్ అనే మాట‌కు స‌రైన న్యాయం చేస్తుంది.  అప్ప‌ట్లో విజ‌య‌శాంతి సినిమాల‌కు హీరోలు లేక‌పోయినా వ‌సూళ్ల పంట పండేది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అనుష్కే ఆ స్థానం అందుకుంటుంది. పదేళ్ల కిందే అరుంధ‌తి సినిమాతో రికార్డులు తిర‌గ‌రాసింది ఈ భామ‌. ఇక ఇప్పుడు మ‌రోసారి భాగ‌మ‌తితో అదే చేస్తుంది. ఈ చిత్రం యావ‌రేజ్ టాక్ తో మొద‌లై కూడా క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. తొలిరోజు నుంచే అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుంది. వ‌సూళ్ల విష‌యంలో రోజురోజుకీ మెరుగు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే నాలుగు రోజుల్లోనే ఏపీ తెలంగాణాల్లో 14 కోట్ల షేర్ వ‌సూలు చేసింది భాగ‌మ‌తి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే వ‌సూళ్లు 24 కోట్ల‌కు చేరిపోయాయి. తెలుగులో 17 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తే.. త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో మ‌రో 6 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. ఫుల్ ర‌న్ లో సినిమా ఈజీగా 35 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది. మొత్తానికి భాగ‌మ‌తి క‌లెక్ష‌న్ల‌తో మ‌తి పోగొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here