మహానటి చూసిన తర్వాత మగవాళ్ళుగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది – యన్.టి.ఆర్


యంగ్ టైగర్ యన్ టి ఆర్ చేతుల మీదుగా మహానటి ఆడియో లాంచ్ జరిగింది. కింగ్ నాగార్జున, నతురల్ స్టార్ నాని , దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఇతర ప్రముఖులు అతిధులుగా హాజరయ్యారు.
చిత్ర తారాగణం సాంకేతిక నిపుణులు అందరు విచ్చేసిన ఫంక్షన్ కన్నుల పండుగగా సాగింది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిని ఈ ఫంక్షన్ లో మాట్లాడుతూ నాగార్జున.. సావిత్రి గారి తోనే నేను వెలుగు నీడలు చిత్రం లో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. మహానటి తెలుగు లో మొదటి బయోపిక్. ఒక లేడి సూపర్ స్టార్ మీద చిత్రం తీయడం.. అదీ ఇద్దరు లేడీ ప్రొడ్యూసర్స్ తీయడం.. ఇంకా ఈ చిత్రంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇతర సాంకేతిక వర్గంలో కూడా లేడీసే ఎక్కువ పని చేసారని విన్నాను. అది మా ఇండస్ట్రీ లో ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం.
“నా జీవితం మొదలయింది సావిత్రి గారి తో, అసిస్టెంట్ డైరెక్టర్ గా యన్ టి ఆర్ గారు సావిత్రి గారు నటించిన పాండవ వనవాసం తో నా కెరీర్ స్టార్ట్ అవ్వడం నా అదృష్టం, అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసింది నేనే. నాగ్ అశ్విన్ నన్ను దాటి పోవాలి అని కోరుకుంటున్నాను.” అన్నారు దర్శేకేంద్రుడు రాఘవేంద్ర రావు.
“తెలుగు లోకి ఇంత గొప్ప చిత్రం తో అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉంది. నాగ్ అశ్విన్ రెండో చిత్రంలా తీయలేదు. టైటానిక్ లాంటి ఓ మాగ్నమ్ ఓపస్ తీసాడు.” అన్నారు దుల్కర్ సల్మాన్.
“సావిత్రి గారి గురించి చెప్పడానికి నాకు వయసు అరహతా లేదు. దొరికింది ఇస్తేనే ఎవడే సుభ్రమణ్యం చేసాడు, ఈ సినిమా కి అడిగింది ఇచ్చినట్టు ఉన్నారు, ఏ రేంజ్ లో తీసాడు కనిపిస్తుంది,” అన్నారు హీరో నాని

“ఈ సినిమా ద్వారా యన్ టి ఆర్ , నాగేశ్వర్ రావు గారు, సావిత్రి గారు, ఎస్ వి రంగారావు గారు వంటి లెజెండరీ యాక్టర్స్ కి డైలాగ్ రాసె అదృష్టం కలిగింది, రైటర్ గా ఇంకేం కావాలి. సినిమా మూడ్ బట్టి మనం కూడా ట్రావెల్ అవుతాం. కీర్తి సురేష్ కళ్ళకి దండం పెట్టాలనిపించేంత సావిత్రి గారిని గుర్తు చేస్తుంది,” అన్నారు మతాల రచయిత సాయి మాధవ్ బుర్ర
“సినిమా లో ఒక్క సీన్ నచ్చి ఒప్పుకున్నాను, అందుకే నేనే దుబ్బింగ్ కూడా చెప్పాను .. ఆ ఒక్క సీన్ కి ఎన్ని టేక్స్ తీసుకున్నా గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లు వచ్చేసాయి, అంత ఇన్ వాల్వ్ అయ్యేలా తీసాడు నాగ్ అశ్విన్,” అన్నారు చిత్రంలో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న సమంత. కథ నడవడంతో ఆమెది కీలక పాత్ర. ఆమె సరసన విజయ్ దేవేరుకోండ నటించారు.
ఇక సావిత్రి గా నటించిన కీర్తి సురేష్.. మొదట నన్ను నాని, స్వప్న సంప్రదించినప్పుడు నో చెప్పాను. అంత మహానటి పాత్రా చేయడం చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అని, నేను చేయలేనన్న. నాగ్ అశ్విన్ యు కెన్ డు ఇట్ అని ఎంకరేజ్ చేసాడు. సావిత్రి గరే నాకీ అవకాశమిచ్చారేమో, ఆమె బ్లెస్సింగ్స్ తో చేశాను.
ముఖ్య అతిధి గా వచ్చి ఆడియో ఆవిష్కరించిన యంగ్ టైగర్ యన్ టి ఆర్ మాట్లాడుతూ.. సావిత్రి గరే పట్టు బట్టి నా చిత్రం తీయండి అని నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంకలను ఇన్స్పైర్ చేశారేమో. దేవుడంటే ప్రకృతే.. మనం బలం గా ఏదైనా కోరుకుంటే ప్రకృతి అంతా ఏకమవుతుందంటారు.. అలానే నాగ్ అశ్విన్ దగ్గరకి కీర్తి సురేష్ ని, దుల్కర్ సల్మాన్ ని , సమంత ని, విజయ్ దేవేరుకోండని ఏకం చేసి.. ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా వచ్చేలా చేసిందేమో. సావిత్రి గారి జీవితం ఎంత గొప్పగా బ్రతకాలో చెప్పే ది కాబట్టి తప్పకుండ తీయవలసిన చిత్రం. ఆడవాళ్లపై అకృత్యాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక లేడీ సూపర్ స్టార్ ఎప్పటికి ఇన్స్పిరేషన్ గా నిలిచే ఆమె జీవిత చిత్రంగా వస్తున్న ఈ మహానటి చూసిన తర్వాత మగవాళ్ళుగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది, అంత గొప్ప నటి అంతే గొప్పగా నాగ్ అశ్విన్ తీసి ఉంటాడు. మహానటి చూసాక అందరూ ఆడవాళ్లను గౌరవించడం మొదలుపెడతారని ఆశిస్తున్నాను. నన్ను మా తాతగారి పాత్ర చేయమని అడిగారు, ఇప్పుడే కాదు నేనెప్పటికీ ఆయన పాత్ర చేసే సాహసం చేయను.”
మహానటి సావిత్రి మే 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here