రామ్ తో ప్ర‌వీణ్ స‌త్తా…ర్..!

Hello Guru Prema Kosame Movie Opening Photos
ప్ర‌వీణ్ స‌త్తార్.. గ‌తేడాది వ‌ర‌కు కూడా ఈ పేరును ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే ఈయ‌న కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవు కాబ‌ట్టి. గుంటూర్ టాకీస్ విజ‌యం సాధించినా కూడా అది అడ‌ల్ట్ సినిమా. అందులో హీరోయిన్ల అందాలు.. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తోనే సినిమా హిట్టైంది. దాంతో ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా ఎవ‌రికీ తెలియ‌లేదు. కానీ గ‌తేడాది గ‌రుడ‌వేగ‌తో త‌న స‌త్తా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్. కానీ ఈయ‌న టేకింగ్ కు మాత్రం అంతా ఫిదా అయిపోయారు. ఫామ్ లో లేని రాజ‌శేఖ‌ర్ ను హీరోగా తీసుకోవ‌డ‌మే పెద్ద షాక్ అనుకుంటే.. ఆయ‌న్ని పెట్టి థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించాడు ప్ర‌వీణ్. గ‌త కొన్నేళ్లుగా రాజ‌శేఖ‌ర్ సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ గ‌రుడవేగ 7.3 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇది ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ఉన్న ఇమేజ్ కు చాలా ఎక్కువ‌. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌వీణ్ స‌త్తార్ తో ప‌ని చేయ‌డానికి మ‌న హీరోలు బాగానే ఆస‌క్తి చూపిస్తున్నారు. గ‌రుడ‌వేగ త‌ర్వాత ప్ర‌వీణ్ ఏం చేస్తాడో అనే దానిపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి మొద‌లైంది. దీనికి స‌మాధానంగా రామ్ పేరు వినిపిస్తుంది. కుర్ర హీరో రామ్ కు ఇప్ప‌టికే ప్ర‌వీణ్ ఓ క‌థ చెప్పాడ‌ని.. దానికి రామ్ నుంచి కూడా ఓకే అనే స‌మాధానమే వ‌చ్చింద‌ని తెలుస్తుంది. ఇప్పుడు రామ్ క‌మిట్ అయిన త్రినాథ‌రావ్ న‌క్కిన సినిమా పూర్తికాగానే ప్ర‌వీణ్ సినిమా మొద‌ల‌వుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా రామ్ తో ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here