రెజీనా.. అది పోజా.. ఇంద్ర‌ధ‌నస్సా..?


కొంద‌రు హీరోయిన్ల‌కు పాపం అదృష్టం ఉండ‌దు. వాళ్లేం చేసినా కూడా అవ‌కాశాలు రావు. అలాంటి దుర‌దృష్ట‌వంతురాలు రెజీనా. లేక‌పోతే మ‌రేంటి ఆమెతో పాటు వ‌చ్చిన హీరోయిన్లంతా ఇప్పుడు టాప్ హీరోయిన్లు అయిపోయారు. అంతెందుకు ఆమె ప్రాణ స్నేహితురాలు ర‌కుల్ నెంబ‌ర్ వ‌న్ కూడా అయింది. కానీ రెజీనా మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉంది. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లుగా ఈ రోజు కూడా స్టార్ అవ్వాల‌ని ఆరాట‌ప‌డు తూనే ఉంది కానీ కాలేదు.. కావ‌ట్లేదు.. అవుతుందో లేదో క్లారిటీ లేదు. అందం ఉంది.. అభిన‌యం ఉంది కానీ అదృష్ట‌మే లేక అక్క‌డే ఆగిపోయింది రెజీనా. దాంతో అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క.. ఇప్ప‌ట్నుంచి ఒక‌లెక్క అన్న‌ట్లుగా తాజాగా ఓ త‌మిళ సినిమా కోసం అందాల‌న్నీ ఆర‌బోసింది రెజీనా. కెమెరాలు క‌నిపిస్తే ఆటోమేటిక్ గా అందాలు ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు మిస్ట‌ర్ చంద్ర‌మౌళి అనే త‌మిళ సినిమాలో అమ్మాయిగారు రెచ్చిపోయిన తీరు చూసి ఎవ్వ‌రైనా క‌ళ్లు తేలాయాల్సిందే. వాన ప‌డుతుంటే ఇంద్ర‌ధ‌న‌స్సులా వంగిపోయి రెజీనా ఇచ్చిన పోజు చూస్తుంటే కుర్రాళ్ల‌కు నిద్ర అనే మాట వ‌స్తే చూడండి. మునిగిపోతున్న కెరీర్ నావ‌ను ఒడ్డుకు చేర్చుకోడానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ గ్లామ‌ర్ షో అయినా రెజీనా కెరీర్ ను దారికి తీసుకొస్తుందో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here