శ్రీ‌దేవి కూతుళ్ల ప‌రిస్థితి ఏంటిప్పుడు..?

 

ఎవ‌రైనా మ‌నిషి బ‌తికున్న‌పుడే ప‌ట్టించుకుంటారు. ఒక్క‌సారి ఆ మ‌నిషి పోయిందంటే ప‌ట్టించుకునే వాళ్ళే క‌రువ‌వుతారు. మొన్న‌టి వ‌ర‌కు శ్రీ‌దేవి కూతుళ్లు అంటే బాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంది. ఎందుకంటే తోడుగా శ్రీ‌దేవి ఉంది కాబ‌ట్టి. కానీ ఇప్పుడు ఆమె లేదు. వెళ్లిపోయింది.. దాంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రు కూతుళ్ల ప‌రిస్థితేంటి అనేది బాలీవుడ్ మీడియాలో బాగా న‌డుస్తున్న చ‌ర్చ‌. శ్రీ‌దేవి ఉన్న‌పుడు తాను ఎంత ఇబ్బంది పడినా కూడా కూతుళ్ల‌కు మాత్రం ఏ క‌ష్టం రాకుండా చూసుకుంది. ఉన్న‌న్ని రోజులు తాను క‌ష్ట‌ప‌డుతూ కుటుంబాన్ని సుఖ‌పెట్టింది. కానీ ఇప్పుడు ఆమె లేదు. దాంతో శ్రీ‌దేవి కూతుళ్ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది.
శ్రీ‌దేవి బ‌తికున్న‌పుడు జాన్వి క‌పూర్, ఖుషీ క‌పూర్ యువ‌రాణుల్లా బ‌తికారు. ఆమెకు ఉన్న పిఆర్ తోనే కూతుళ్లు ఏం చేసినా చెల్లింది. పెద్ద కూతురు ఝాన్వీపై బాలీవుడ్ లో చాలా రూమ‌ర్లు కూడా ఉన్నాయి. ప్రేమ‌లో ప‌డింద‌ని.. ఒక‌ట్రెండు సార్లు తాగి ప‌ట్టుబ‌డింద‌నీ.. ఇలా చాలా అంటూ చాలా వార్త‌లే వ‌చ్చాయి. కానీ ఇవ‌న్నీ బ‌య‌టికి రాక‌పోవ‌డానికి కార‌ణం శ్రీ‌దేవి. ఆమెపై ఉన్న గౌర‌వ‌మో.. లేదంటే ఇమేజో.. అదీ కాదంటే ఆమె పిఆర్.. కార‌ణ‌మేదైనా శ్రీ‌దేవి కూతుళ్ల‌కు చెడ్డ‌పేరు రాలేదు. కానీ ఇప్పుడు శ్రీ‌దేవి లేదు. ఆ కూతుళ్ల‌కు అమ్మ లేదు. ఇన్నాళ్లూ త‌ల్లి చాటు బిడ్డ‌ల్లా ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లు ఇప్పుడు ఎటెళ్లాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ప‌డిపోయారు. పాపం.. శ్రీ‌దేవికి అయితే పెద్ద కూతురును హీరోయిన్ గా చూడాల‌ని చాలా ఆశ‌. పాపం అది తీర‌కుండానే వెళ్లిపోయింది.
ఝాన్వి న‌టిస్తోన్న ధ‌డ‌క్ షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తికానుంది. జూన్ లో సినిమా విడుద‌ల కానుంది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు ఝాన్వి ఏం చేసినా న‌డిచింది. త‌ల్లికి ఉన్న ఇమేజ్ ను వాడుకుంటూ కొన్నిసార్లు మితిమీరిన ప‌నులు కూడా చేసింది ఝాన్వి. కానీ శ్రీ‌దేవి కూతురు అనే ఒకేఒక్క బ్రాండ్ ఝాన్విని కాపాడింది. కానీ ఇప్పుడు ఆ బ్రాండే లేదు. ఇప్పుడు కూడా ఝాన్విక‌పూర్ ఇలాగే ఉంటుందా..? ఇక ఖుషీ క‌పూర్ అయితే త‌ల్లిచాటు బిడ్డే. ఎప్పుడూ అమ్మ‌ను వ‌దిలి ఉండ‌లేని చిన్న‌కూతురు. ఇప్పుడు శ్రీ‌దేవి చ‌నిపోయినందుకు కాదు.. ఆ ఇద్ద‌రు కూతుళ్ల‌ను చూసి అంతా బాధ ప‌డుతున్నారు. బోనీక‌పూర్ ఉన్నా కూడా ఫ్యామిలీ బాధ్య‌త‌ల‌న్నీ తానే చూసుకునేది శ్రీ‌దేవి. పాపం.. మ‌రిప్పుడు ఆ ఇద్ద‌రు కూతుళ్ల ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో ఏమో అంటూ బాధ ప‌డుతున్నారు శ్రీ‌దేవి స‌న్నిహితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here