శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం వెనక రహస్యం?

 

అసలు శ్రీ రెడ్డికి, పొలిటికల్ పార్టీలకి ఏమైనా సంభందం ఉందా? శ్రీ రెడ్డి మొదలుపెట్టిన కాస్టింగ్ కౌచ్ రగడ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పోతుంది? అసలు శ్రీరెడ్డి కి ఏం కావాలి? అవకాశాలా, పబ్లిసిటీనా? సొసైటీ? డబ్బా? లేదా సొసైటీ లో మర్యాదా?
శ్రీ రెడ్డికి పేరే కావాలి అనుకోని ఉంటె అలా అందరి ముందు అర్థ నగ్నంగా నిలబడేది కాదు..ఇప్పుడు చేస్తున్న సీన్లు ఇక ఎప్పటికి మంచి పేరు, సొసైటీ లో మర్యాద తీస్కొని రావు. అవకాశాలు రావటం లేదు అని పోరాడి డైరెక్టర్ తేజ గారితో అవకాశం దక్కిన్చుకుంది..’మా’ సభ్యత్వం కావాలి అని నడి రోడ్ పై అర్ధ నగ్నంగా నుంచొని ‘మా’ సభ్యత్వం తెచ్చుకుంది. ఇంకా ఎం కావాలి అని మానిన గాయాన్ని తిరిగి రేపుతోంది. రానున్న ఎలక్షన్స్ లో సీటు కోరుకుంటుందా..లేక రాజకీయ నాయకుల చేతులో కీలు బొమ్మగ మారిందా ? అని టీవీలో రోజుల తరబడి ఇదే డ్రామాను చూసి విసిగిపోయిన సగటు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ పార్టీల చేతిలో కీలు బొమ్మగా మారింది అన్నది ఇటీవల ఆమె ప్రవర్తన చూస్తుంటే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటకి వచ్చాక తెలుగు దేశాన్ని ప్రశ్నించరే అని అడిగిన అందరికి సమాధానంగా జన సేన ఆవిర్భావ సభలో చంద్రబాబును, తనయుడు లోకేష్ ను అవినీతిపై గట్టిగా నిలదీశారు. ఈ అక్కసుతోనే, అంచెలంచెలుగా ఎదుగుతున్న పవన్ ని తొక్కేసే ప్రయత్నంలో భాగంగానే శ్రీ రెడ్డి ని ఉసిగొల్పరా అనే అనుమానం వ్యక్తపరుస్తున్నారు అభిమానులు. కానీ శ్రీ రెడ్డి లాంటి అమ్మాయిలు ఎన్ని ఆరోపణలు చేసినా, గతం లో ఎంతో మంది ఎన్నో చేసినా ఏవి ఫలించలేదు. పోనీ శ్రీ రెడ్డి కి మద్దతు తెలుపుతున్న వాళ్ళని చూస్తుంటే ఇలాంటి ఆరోపణలకు అసలు మీడియా ఎందుకు ఇంత అతి ఉత్సాహంతో కవరేజ్ చేస్తుంది అనే డౌట్ రాకా మానదు. మీడియా కుడా పార్టీలతో చేతులు కలిపాయి అంటే అవును అనే అంటున్నారు అంతా.
ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ పోరాటం లో భాగంగా తలపెట్టిన బంద్ గురించి కాకుండా శ్రీ రెడ్డి గురించి ప్రైమ్ టైం లో రౌండ్ టేబుల్ డిస్కషన్ లు పెట్టి మాట్లాడుకునే అంత ఇంపార్టెంటా? దీనివల్ల ప్రజలకు ఏమిటి ఉపయోగమని అదే మీడియా వాళ్ళు గుండెల మీద చేయవేసుకొని ఆలోచిస్తే మంచిది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here