సాయిప‌ల్ల‌వి-నాని.. వీళ్ల కెమిస్ట్రీ ఏంటో మ‌రి..!

రోజుకో పాట విడుద‌ల‌వుతుంది.. ఒక్క పాట‌లో అయినా కాస్త త‌క్కువ కెమిస్ట్రీ పండిస్తారేమో అనుకుంటాం కానీ దేనిక‌దే ఇద్ద‌రూ చంపేసారంతే. ఒక‌రి కంటే మ‌రొక‌రు చంపేంత ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చేసారు. ఎంసిఏ గురించే మనం మాట్లాడుకునేది. అస‌లు సాయిప‌ల్ల‌వి, నాని మ‌ధ్య ఉన్న కెమిస్ట్రి చూస్తే వీళ్లిద్ద‌రూ క‌లిసి ఎన్ని సినిమాలు చేసారో అనిపిస్తుంది. ఇద్ద‌రు న్యాచురల్ యాక్ట‌ర్స్ క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుందో ఎంసిఏ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌ల్లోనూ ర‌చ్చ చేసారు ఇద్ద‌రు. ఇక ఇప్పుడు వ‌చ్చిన ఎమండోయ్ నానిగారు పాట‌లోనూ సాయిప‌ల్ల‌వి త‌న క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేస్తే.. నాని కూడా కౌంట‌ర్ ఇచ్చాడు. వెండితెర‌పై ఇద్ద‌రు న్యాచుర‌ల్ స్టార్స్ ఒకేసారి ప‌ర్ఫార్మ్ చేస్తుంటే చూడ్డానికి నిజంగానే రెండు క‌ళ్లు స‌రిపోవు.
ప్ర‌తీ పాట‌లోనూ ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ అదిరిపోయింది. మొన్న విడుద‌లైన కొత్త‌గా కొత్త‌గా.. నిన్న విడుద‌లైన ఏమైందో తెలియ‌దు నాకు.. నేడు వ‌చ్చిన ఏమండోయ్ నానిగారు సాంగ్ ఇలా అన్నింట్లోనూ వీళ్లు చంపేసారు. నాని, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దాంతో ఈ జోడి ఎంసిఏపై ఆస‌క్తితో పాటు అంచ‌నాలు కూడా చాలా పెరిగాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి బంధాలు, అనుబంధాలే మెయిన్ బేస్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్. మొత్తానికి ఎంసిఏ మ్యూజిక్ ప‌రంగా సూప‌ర్ హిట్. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. ఈ ఇద్ద‌రు న్యాచుర‌ల్ యాక్ట‌ర్స్ క‌లిసి ఎంసిఏ రేంజ్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్ల‌నున్నారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here