సాయిప‌ల్ల‌వి.. మ‌రీ ఇలా అయితే క‌ష్టమే..!

MCA Pre Release Event Photos (1)
అదేంటి.. సాయిప‌ల్ల‌వి ఏం చేసింది.. కొంప‌దీసి ఏమైనా త‌ప్పు చేసిందా ఏంటి అనుకుంటున్నారా..? అస‌లు స‌మ‌స్య అది కాదు. సాయిప‌ల్ల‌వి సినిమాలో ఉంటే ఇప్పుడు హీరోలు వ‌ణికిపోతున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ భామ సినిమాలో ఉంటే హీరోల‌ను కూడా పూర్తిగా తినేస్తుంది. త‌న న‌ట‌న‌తో హీరోల‌ను క‌న‌బ‌డ‌కుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఫిదాలో అస‌లు వ‌రుణ్ తేజ్ అనే హీరో ఉన్నాడ‌నే విష‌యాన్నే ప్రేక్ష‌కులు మ‌రిచిపోయారు. అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిపోయింది. భాన్సువాడ భానుమ‌తే సినిమా అంతా క‌నిపిస్తుంది. ఇక ఇప్పుడు విడుద‌లైన ఎంసిఏలోనూ ఇదే చేసింది సాయిప‌ల్ల‌వి. అయితే ఇక్క‌డున్న‌ది నాని కావ‌డంతో సాయిప‌ల్ల‌వికి ట‌ఫ్ కాంపిటేష‌న్ త‌ప్ప‌దేమో అనుకున్నారు కానీ నానిని కూడా కొన్ని సీన్ల‌లో త‌న న‌ట‌న‌తో డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న కిల్లింగ్ ఎక్స్ ప్రెష‌న్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఉన్న‌ది త‌క్కువ పాత్రే అయినా.. ఫిదాతో పోలిస్తే ఇక్క‌డ న‌ట‌న‌కు స్కోప్ త‌క్కువ‌గానే ఉన్నా కూడా సాయిప‌ల్ల‌వి త‌న స‌త్తా చూపించింది. రొటీన్ కారెక్ట‌ర్ ను కూడా త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ఎక్స్ ట్రార్డిన‌రీ అయిపోయింది. సాయిప‌ల్ల‌వి ఉన్నంత సేపు సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. మొత్తానికి సాయిప‌ల్ల‌వి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంటే హీరోలు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే ఇక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here