స‌మంత ప్లేస్ కొట్టేసిన కాజ‌ల్..

KAJAL SAMANTHA

అదేంటి.. ఇప్పుడు సీన్ ప్ర‌కారం చూస్తుంటే కాజ‌ల్ కంటే స‌మంత స్టార్ హీరోయిన్ క‌దా..? ఈమెకు క‌దా ఈ మ‌ధ్య వ‌ర‌స విజ‌యాలు వ‌స్తున్నాయి.. అలాంట‌ప్పుడు ఈమె ప్లేస్ ను ఆమె తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న‌ ట్విస్ట్ ఉంది. స‌మంత స్థానాన్ని తీసుకోవ‌డం అంటే ఆ హీరోయిన్ న‌టించిన సినిమాలో ఇప్పుడు కాజ‌ల్ న‌టించ‌బోతుంద‌ని అర్థం. అవును..

స‌మంత రెండేళ్ల కింద త‌మిళ‌నాట న‌టించిన తెరీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. విజ‌య్ కు జోడీగా ఈమె న‌టించిన రెండో సినిమా ఇది. క‌త్తి.. త‌ర్వాత తెరీ.. మొన్న మెర్స‌ల్.. మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లే. ఇప్పుడు తెరీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు సంతోష్ శ్రీ‌నివాస్. ఈ చిత్ర క‌థ‌ను పూర్తిగా మార్చేస్తున్నాడు. ఎందుకంటే తెరీ ఇప్ప‌టికే తెలుగులో పోలీసోడుగా వ‌చ్చింది. పైగా చాలా మంది సినిమాలు చూసుంటారు కూడా.

అందుకే థీమ్ మాత్ర‌మే తీసుకుని.. మిగిలింది మారుస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ర‌వితేజ ఇందులో హీరో. ఇక తెరీలో స‌మంత పోషించిన పాత్ర‌ను ఇప్పుడు తెలుగులో కాజ‌ల్ చేయ‌బోతుంది. దీనిపై స్వ‌యంగా చంద‌మామే క్లారిటీ ఇచ్చింది కూడా. తెరీ రీమేక్ లో ర‌వితేజ‌తో న‌టించ‌బోతున్నానని చెప్పింది కాజ‌ల్. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే ర‌వితేజ‌తో ఈమె న‌టించిన వీర‌.. సారొచ్చారు రెండూ డిజాస్ట‌ర్లే. మ‌రి ఇప్పుడు మూడోసారి ఏం చేస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here