హ్యాపీ బ‌ర్త్ డే టూ సాయిప‌ల్ల‌వి..


సాయిప‌ల్ల‌వి.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. చేసింది మూడు సినిమాలే తెలుగులో కానీ ఇమేజ్ మాత్రం చాలా ఉంది. ఫిదా.. ఎంసిఏ.. క‌ణం.. మూడు ఒక్కో జోన‌ర్ లో వ‌చ్చిన సినిమాలే. క‌ణం ఫ్లాప్ అయినా ప‌ల్ల‌విలోని న‌టిని కొత్త‌గా ప‌రిచ‌యం చేసిన సినిమా.
ఫిదా గురించి ఏం చెప్పాలి. ఎంతోమంది హీరోయిన్లు క‌ల‌లు క‌నే డెబ్యూ సినిమా ఇది. తెలుగులోకి తెలుగు రాని ఓ అమ్మాయి తెలంగాణ మాండ‌లీకం నేర్చుకుని మ‌రీ డ‌బ్బింగ్ చెప్పి అంద‌రినీ త‌న న‌ట‌న‌తో ప‌డేసింది సాయిప‌ల్ల‌వి. ఈ చిత్రం త‌ర్వాత ఎంసిఏ కూడా అంతే. దానికి ముందే ప్రేమ‌మ్, కాలి లాంటి మ‌ళ‌యాలం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది సాయిప‌ల్ల‌వి.
మే 9న ఆమె పుట్టిన‌రోజు. ప్ర‌స్తుతం తెలుగులో శ‌ర్వానంద్ హీరోగా ప‌డిప‌డి లేచే మ‌న‌సులో న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. ప‌ల్ల‌వి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here