20 ఏళ్ల‌కే ఆ ముద్దుగుమ్మ బైబై..

కొన్నిసార్లు కొంద‌రు తీసుకునే నిర్ణ‌యాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తాయి. ఈ మ‌ధ్యే రిచా గంగోపాధ్యాయ సినిమాలు మానేసి షాక్ ఇచ్చింది. ఈమె సంగ‌తి ఇంకా మ‌రిచిపోక‌ముందే అవికా గోర్ కూడా సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌ని ఫిక్సైపోయింది. రిచాకైనా క‌నీసం 30 ఏళ్లుంటాయి. కానీ అవికా మాత్రం ఇంకా చిన్నారి పెళ్లికూతురే. అతిచిన్న వ‌యసులోనే.. రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ నే సంపాదించుకుంది అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురు. ప‌దేళ్లు కూడా నిండకుండానే బాలికా వ‌ధు సీరియ‌ల్ తో ఇండియ‌న్ వైడ్ గా పాపుల‌ర్ అయింది ఈ భామ‌. 18 ఏళ్ల‌కే హీరోయిన్ అయిపోయి తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సినిమాల‌తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది అవికా.
అయితే సినిమాల్లో న‌టిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ షోలో మాత్రం హ‌ద్దులు దాట‌లేదు అవికా గోర్. అయితే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉంటూ అందాలు ఆర‌బోయ‌క‌పోతే నెగ్గుకు రావ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని చిన్నారి పెళ్లికూతురికి తెలిసొస్తున్న‌ట్లుంది. అందుకే తాను గ్లామ‌ర్ షోకు సిద్ధ‌మంటూ ద‌ర్శ‌క నిర్మాత‌లకు హింట్ ఇస్తుంది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్య బ‌య‌టి ఫంక్ష‌న్ ల‌కు వ‌స్తున్న‌పుడు చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది అవికా. దీనికితోడు ఈ మ‌ధ్య కాలంలో బ‌రువు బాగా త‌గ్గింది ఈ ముద్దుగుమ్మ‌. స‌న్న‌బ‌డిన త‌న అందాన్ని చిట్టి పొట్టి కాస్ట్యూమ్స్ లో కెమెరాల‌కు వ‌లేస్తుంది చిన్నారి పెళ్లికూతురు. ఈ మ‌ధ్యే ఓ అవార్డ్ ఫంక్ష‌న్ కు వ‌చ్చిన అవికా.. అక్క‌డ కూడా గ్లామ‌ర్ షోనే ఆయుధంగా వాడుకుంది. అయితే ఎంత వేడెక్కించినా.. ఇప్ప‌టికీ ఈ భామ‌కు సినిమా అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు.
దాంతో త‌న‌కు లైఫిచ్చిన సీరియ‌ల్స్ లోకి వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. క‌ల‌ర్స్ ఛానెల్ లో ప్ర‌సారం కానున్న లాడూ 2లో మెయిన్ ఫీమేల్ లీడ్ గా న‌టిస్తుంది ఈ భామ. పైగా సినిమాల్లో ఆఫ‌ర్లు రావాలంటే కొంద‌రికి న‌చ్చిన‌ట్లు ఉండాల్సి వ‌స్తుంద‌ని.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌ను కొంద‌రు వేధించార‌ని ఆ మ‌ధ్య చెప్పింది అవికా. అందుకే ఇక సినిమాలు మానేసి.. సీరియ‌ల్స్ తోనే కాలం గ‌డిపేయాల‌ని చూస్తుంది ఈ చిన్నారి పెళ్లికూతురు. మొత్తానికి ఎక్క‌డ మొద‌లుపెట్టిందో.. అక్క‌డికే వెళ్లింద‌న్న‌మాట అవికా గోర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here