200 కోట్ల వైపుగా అజిత్ విశ్వాసం సినిమా కలెక్షన్లు..

తమిళ నటుడు అజిత్ సినిమా ఓ రేంజ్ లో పండుగ చేసుకుంటుంది. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసింది. మరో రెండు వారాలు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో 250 కోట్ల క్లబ్బులో చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 200 కోట్లు వసూలు చేయని అజిత్ తొలిసారి ఈ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. విజయ్, రజనీకాంత్, విక్రమ్ తర్వాత తమిళనాట ఈ రికార్డు సాధించాడు అజిత్. రజినీకాంత్ పేట సినిమాను తట్టుకొని వసూళ్ల వర్షం కురిపించింది విశ్వాసం. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది ఈ చిత్రం.

ajith viswasam collections

తొలిరోజు టాక్ యావరేజ్ గా వచ్చినా కూడా కలెక్షన్లలో మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది విశ్వాసం. పోటీగా రజనీ సినిమా ఉన్నా కూడా ఎక్కడ తగ్గలేదు అజిత్. తొలి రోజు నుంచి తమిళనాట రజనీకాంత్ సినిమాను డామినేట్ చేస్తూనే ఉన్నాడు. పేట కంటే తమిళనాట ఎక్కువ వసూలు చేసింది విశ్వాసం. ఈ సినిమాతో కూడా చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. వివేకం సినిమాతో గాడి తప్పిన అజిత్ కెరీర్.. విశ్వాసంతో మళ్లీ గాడిన పడింది. అప్పుడు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు హిట్టిచ్చాడు. మొత్తానికి పోయిన చోటే మళ్ళీ వెతుక్కున్నాడు అజిత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here