ఆర్ ఎక్స్ 100 భామతో జోడీ కట్టనున్న మన్మధుడు..

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో బాగానే పాపులర్ అయ్యింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే రవితేజ డిస్కో రాజాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది పాయల్. ఇక ఇప్పుడు ఈ భామకు మరో అవకాశం కూడా వచ్చింది. టాలీవుడ్ కింగ్ నాగార్జునతో రొమాన్స్ చేసే అవకాశం పాయల్ రాజ్ పుత్ కు వచ్చింది. నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. చి ల సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

payal-rajput- nagarjuna

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ తీసుకుంటున్నారు. దర్శకుడిగా చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.. మన్మధుడు 2తో స్టార్ డైరెక్టర్ కావాలని చూస్తున్నాడు. కథ నచ్చి నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థలో మన్మధుడు సీక్వెల్ నిర్మిస్తున్నాడు. జూలైలో సినిమా విడుదల కానుంది. నాటి మన్మధుడు సినిమాలో అమ్మాయిలంటే దూరంగా పారిపోయే పాత్రలో నటించాడు నాగార్జున. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే వస్తున్నాడని తెలుస్తోంది త్రివిక్రమ్ కథ మాటలతో తొలి భాగం సంచలనం సృష్టించింది. మరి అదే రేంజ్ లో ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ కూడా తన పెన్ పవర్ చూపిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here