మహర్షిలో భరత్ అనే నేను సీన్.. ప్రెస్ మీట్ తో రచ్చ..

మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షితో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు ఈ చిత్ర షూటింగ్ కేరళలోని పొల్లాచ్చిలో జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కూడా ఒక ప్రెస్ మీట్ సీన్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రెస్ మీట్ అంటే భరత్ అనే నేను సినిమా గుర్తుకు వస్తుంది. అందులో ఒక సీన్లో మీడియాను ఓ రేంజ్ లో టార్గెట్ చేశాడు మహేష్ బాబు. కొరటాల శివ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ప్రస్తుతం మీడియా ఎలా ఉందనే విషయాన్ని పూర్తిగా చూపిస్తూ.. వచ్చే ఈ ప్రెస్ మీట్ సీన్ భరత్ అనే నేను సినిమాకు హైలెట్ గా నిలిచింది.

Bharat Ane Nenu JP

ఇప్పుడు మహర్షి సినిమాలో కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ సీన్ ఉండబోతుంది. ప్రస్తుతం ఈ సీన్ కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. ఇక ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీనికి సంబంధించిన ఒక పిక్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. ఇది చూసి మహేష్ బాబు అభిమానులు ఆనందపడిపోతున్నారు. మహర్షి సినిమాలో కూడా కచ్చితంగా భరత్ అనే నేను రేంజ్ లో ప్రెస్ మీట్ సీన్ ఉంటుందని.. సినిమాకు ఇది ప్రాణంగా నిలబడుతుందని నమ్ముతున్నారు వాళ్ళు. ఇందులో రైతుల సమస్యలు చెబుతూ ఈ ప్రెస్ మీట్ సీన్ ఉండబోతోందని తెలుస్తోంది.

శ్రీమంతుడు సినిమా ఛాయలు ఇందులోనూ కనిపిస్తున్నాయి. స్నేహితుడి కోసం సర్వం వదులుకొని వాళ్ల ఊరికి వచ్చి దాన్ని దత్తత తీసుకొని బాగు చేసే ఒక సాఫ్ట్ వేర్ ఎండిగా నటిస్తున్నాడు మహేష్ బాబు. ఇక సూపర్ స్టార్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. రైతుల సమస్యలను ప్రధానంగా తీసుకొని వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కచ్చితంగా ఇది మహేష్ అభిమానులకు పండగలా ఉంటుందని హామీ ఇస్తున్నాడు వంశీ. ఏప్రిల్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మహర్షి సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here