షూటింగ్ లో నానికి యాక్సిడెంట్.. అయినా ఆగని న్యాచురల్ స్టార్..

షూటింగ్ అన్న తర్వాత కచ్చితంగా అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అవి తగిలినంత మాత్రాన షెడ్యూల్ ఆపుకుని కూర్చోలేం కదా అంటున్నాడు నాని. ప్రస్తుతం నటిస్తున్న జెర్సీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఫిబ్రవరి నుంచి విక్రమ్ కే కుమార్ సినిమాతో బిజీ కానున్నాడు నాని. దాంతో ఇప్పుడు జెర్సీ సినిమాను అనుకున్న ప్రకారం పూర్తి చేయాలని చూస్తున్నాడు న్యాచురల్ స్టార్. అయితే ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈయనకు గాయం అయింది.

nani jersey telugu movie first look

ఒక క్రికెట్ సీన్ తీస్తున్న సమయంలో బాల్ వచ్చి అనుకోకుండా నాని ముక్కుకు తగిలింది. దాంతో గాయం పెద్దదై రక్తం కూడా కారింది. అయితే చిన్న ఫస్ట్ ఎయిడ్ తీసుకొని మళ్లీ వెంటనే షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు నాచురల్ స్టార్. గాయం పెద్దది కాకపోవడంతో సీరియస్ ఏమీ లేదని తేలింది. దాంతో తన కోసం షూటింగ్ అంటే మళ్ళీ నిర్మాతకు నష్టం అవుతుందని.. రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా అది విడుదల తేదీపై ప్రభావం చూపిస్తుందని షూటింగ్ పూర్తి చేశాడు నాని. జనవరిలోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమాలో క్రికెటర్ గా నటిస్తున్నాడు నాని. కన్నడ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ నాని తో రొమాన్స్ చేస్తోంది. మొత్తానికి గాయమైనా కూడా షూటింగ్ మాత్రం ఆపలేదు నాచురల్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here