రాజ‌కీయాల్లో రెచ్చిపోతున్న హైప‌ర్ ఆది.. వైసిపితో వివాదం..

హైపర్ ఆది పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. దీనికి కారణం ఆయన పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేయడం. అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ కోసం పక్క పార్టీలతో గొడవలకు దిగుతున్నారు హైపర్ ఆది. ఇది ఇప్పుడు ఆయనపై వైసీపీ కార్యకర్తలకు కోపం తెప్పిస్తోంది.

ఈ మధ్య జనసేన పార్టీ మీటింగ్ లో పాల్గొన్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ను పొగిడే క్రమంలో వైసీపీపై కొన్ని సెటైర్లు వేశాడు. దాంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు హైపర్ ఆదిపై గుర్రుగా ఉన్నారు. ఒక మీటింగ్ కు వచ్చిన ఆదిని టార్గెట్ చేసి భౌతికంగా కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. బెదిరించ‌డం వల్ల ఎలాంటి లాభం ఉండదని.. తను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కి అండ‌గానే ఉంటాన‌ని చెప్పాడు ఆది.

త‌న ఓటు ఎప్పుడూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే అంటూ నిన‌దించాడు హైపర్ ఆది. ఇలా భ‌య‌పెడితే తాను భయపడే రకం కాదని.. తాను చెప్పాల్సిన నిజాలను ప్రజలకు చెప్పే తీర‌తాన‌నంటున్నాడు ఆది. ఈయన తెగింపు చూస్తుంటే ఇప్పుడు ఏదో కొత్త పెంట తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు అంటున్నారు విశ్లేషకులు. మరి హైపర్ ఆది రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

hyper aadi at janasena meeting chittoor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here