లేకపోతే మరేంటి.. కరీనా కపూర్ రాజకీయాల్లోకి రావడం ఏంటి.. విచిత్రం కాకపోతేనూ.. వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి పొలిటికల్ ఎంట్రీపై ఇలా వార్తలు రావడం ఆమెకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తానేంటి రాజకీయాల్లోకి రావడం ఏంటి అంటూ షాక్ అయింది కరీనాకపూర్.
మధ్యప్రదేశ్ భూపాల్ నియోజకవర్గం నుంచి కరీనాకపూర్ను అభ్యర్థిగా కరీనాను నిలబెట్టాలని కాంగ్రెస్ భావించిందని వార్తలు గత 24 గంటలుగా వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన కరీనాకపూర్ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు లేదని తేల్చేసింది. అసలు తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదని.. రాజకీయాల్లో అనుభవం కానీ రావాలని ఉద్దేశం కానీ రెండు లేవని క్లారిటీ ఇచ్చింది కరీనా కపూర్. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ తో కూడా ఈ విషయంపై సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరు ఏం చెప్పినా కూడా కరీనా కపూర్ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చే లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ ఇష్యూకు ఇప్పట్లో ఇక్కడితో తెరపడ్డట్టే.