పవన్ కు భార్య పిల్లలు ఉన్నారు.. నేను డిస్టర్బ్ చెయ్యను..

రేణు దేశాయ్ మళ్లీ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఈమె రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనంగా మారింది. రోజుకో విధంగా ఇంటర్వ్యూలతో రేణు హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఇలాంటి కామెంట్స్ చేసింది పవన్ మాజీ భార్య. ప్రస్తుతం పవన్ భార్య అన్నా లెజ్నివా పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అభిమానులతో చాటింగ్ చేస్తూ ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పింది రేణు దేశాయ్. ఫ్యూచర్ లో మళ్లీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఊహించని విధంగా స్పందించింది రేణు దేశాయ్.

Renu Desai

పవన్ కి ప్రస్తుతం భార్య పిల్లలు ఉన్నారని.. ఇప్పుడు తాను వెళ్లి వాళ్ళని డిస్టర్బ్ చేయలేను కదా అంటూ సమాధానం ఇచ్చింది రేణు. తాను ఎలా అయితే పవన్ అభిమానాన్ని పొందాలని అనుకున్నానో ఇప్పుడు తన భార్య కూడా అలాగే అభిమానం పొందాలని అనుకొంటుంది కదా.. అలాంటప్పుడు తన ప్రేమను ఎలా దోచుకుంటాను అని చెప్పింది రేణు దేశాయ్. పైగా అకిరా కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే వయసుకి వచ్చాడని.. అలాంటి కొడుకు ఉన్నందుకు గర్వపడుతున్నాను అంటోంది రేణుదేశాయ్. భవిష్యత్తులో మళ్లీ పవన్ కు తాను కావాలని అనిపిస్తే.. అతడు కోరుకుంటే వెళ్తానేమో చెప్పలేం అంటూ సంచలనం సృష్టించింది రేణు. ప్రస్తుతం ఈమె చెబుతున్న సమాధానాలు చూస్తుంటే లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here