నిధి అగ‌ర్వాల్ కెరీర్ ఏమ‌వుతుందో.. ఎటు వెళ్తుందో..?

సెలెబ్రెటీ లైఫ్ అంటే తెరిచిన పుస్త‌కం అంటారు కానీ మ‌రీ ఇంత‌గా తెరిచిన పుస్త‌కం అని ఎవ‌రూ ఊహించ‌లేదు. సోకుల తాళం పోగొట్టుకుందో ఏమో కానీ ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్ తో మ‌తులు చెడగొడుతూనే ఉంటుంది నిధి అగ‌ర్వాల్. స‌వ్య‌సాచి విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు ఈ భామ పేరు మ‌న ఇండ‌స్ట్రీలో బాగానే వినిపించింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత పూర్తిగా మానేసారు. అదేం స‌ర‌దానో కానీ ఎప్పుడు చూడూ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొడుతూ ఉంటుంది నిధి అగ‌ర్వాల్. ఇప్పుడు అఖిల్ మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్నులో న‌టిస్తుంది ఈ బ్యూటీ. జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది ఈ చిత్రం. తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తూ వ‌స్తూనే అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.


రోజుకో విధంగా హాట్ గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు. స‌వ్య‌సాచి ఫ్లాప్ అయినా కూడా త‌న‌కు అఖిల్ ఉన్నాడ‌నే ధైర్యంతో ఉంది. పైగా వైష్ణ‌వ్ తేజ్ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. సుకుమార్ క‌థ అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు.. బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు. మొత్తానికి నిధి రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే బాలీవుడ్ ను పూర్తిగా మ‌ర్చిపోయి టాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయేలా క‌నిపిస్తుంది. మ‌రి మ‌న హీరోల నుంచి కూడా ఇంతే ఆద‌ర‌ణ ఉంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here