మ‌హానాయ‌కుడు షూటింగ్ ఎప్ప‌ట్నుంచో తెలుసా..?

కొన్ని రోజులుగా కథానాయకుడు సినిమా ప్రమోషన్ తోనే బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నెల రోజులపైగా అయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు నందమూరి హీరో. పైగా నిర్మాత కూడా తనే కావడంతో ప్రమోషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు బాలకృష్ణ. జనవరి 9న కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మహానాయకుడుపై దృష్టి పెట్టారు బాలకృష్ణ. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి ముహూర్తం పెట్టాడు క్రిష్. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మరో 10 శాతం షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉందని.. ఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేస్తున్నామంటున్నాడు బాల‌య్య‌.

NTR Mahanayakudu Working Stills

జనవరి 12 నుంచి మహా నాయకుడు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు నందమూరి నాయకుడు. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి 25 రోజులు ప్రమోషన్ కే కేటాయించ‌బోతున్నాడు బాలకృష్ణ. మహానాయకుడు కోసం ప్రత్యేకంగా ప్రమోషనల్ టూర్ కూడా చేయనున్నారు ఈ కథానాయకుడు. తొలిభాగంతో పోలిస్తే మహానాయకుడు పై అంచనాలు భారీగా ఉన్నాయి. క‌థానాయ‌కుడులో ఎలాంటి వివాదాలకు చోటు లేదు.. కానీ రెండో భాగంలో మాత్రం వివాదం లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాలు చాలా కీలకపాత్ర పోషించాయి కాబ‌ట్టి.. పైగా ఆయన పొలిటికల్ కెరీర్ పూల బాట కాదు.. ఇవన్నీ సినిమాలో ఎలా క్రిష్ ఆవిష్కరించి ఉంటాడో అని ఆసక్తిగా చూస్తున్నారు నందమూరి అభిమానులు.. వాళ్ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here