వైయ‌స్ జ‌గ‌న్ కు షాక్ ఇస్తున్న పోసాని.. ఏం చేస్తున్నాడంటే.. 

ఎన్నికల్లో తెలియకుండానే జగన్ కు ఫ్యాన్ గాలి సినిమా ఇండస్ట్రీ నుంచి బాగా వీస్తుంది. ఒకరూ ఇద్దరూ కాదు చాలామంది వెళ్లి వైఎస్సార్సీపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే అక్కడ కొందరు తిష్ట వేశారు. ఇప్పుడు ఇంకొందరు వెళ్తున్నారు.. కమెడియన్ అలీ కూడా జగన్ పార్టీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఎన్నికల కోసం పోసాని కృష్ణ మురళి ప్రత్యేకంగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వ తీరును విమర్శించేలా.. జగన్ కు సపోర్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా కూడా తాను చేయాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుంటున్నారు పోసాని కృష్ణ మురళి.
కడప జిల్లాలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. కేవలం 30 రోజుల్లో సినిమా పూర్తి చేసి ఏప్రిల్లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శక నిర్మాత. పదేళ్ల కింద ఇలాగే రాజావారి చేపల చెరువు అంటూ ఒక పొలిటికల్ సెటైర్ సినిమా చేశాడు పోసాని కృష్ణ మురళి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత జగన్ కోసం అలాంటి ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్ కం యాక్టర్. మరి జగన్ కోసం పోసాని ఇవ్వ‌బోయే ఎలక్షన్ గిఫ్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ys jagan posani krishna murali

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here