రాజ్ తరుణ్ మళ్లీ వస్తున్నాడు.. రాజుగారి సాయంతో..

కొందరు హీరోలు ఇండస్ట్రీకి బాణంలా దూసుకొస్తారు. కానీ ఎంత వేగంగా వస్తారో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోతారు. కుర్ర హీరో రాజ్ తరుణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. వరసగా మూడు విజయాలతో టాలీవుడ్ కు దూసుకువచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత అదే స్పీడ్ మెయింటెన్ చేయలేక వెనకబడిపోయాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్ సినిమాలు చేసి పూర్తిగా రేసులో నుంచి తప్పుకున్నాడు రాజ్ తరుణ్. గతేడాది ఈయన నటించిన లవర్ సినిమా డిజాస్టర్ కావడంతో పట్టించుకునేవాళ్లు కరువైపోయారు. దానికి ముందు రంగులరాట్నం, రాజుగాడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.

దిల్ రాజు నిర్మించిన లవర్ సినిమా కూడా అంచనాలు నిలబెట్టకపోవడంతో రాజ్ తరుణ్ పూర్తిగా నటన మానేసి దర్శకత్వం వైపు వెళ్తున్నాడనే వార్తలు వచ్చాయి.

అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ కు దిల్ రాజు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని తెలుస్తోంది. ఈయన త్వరలోనే వెంకటేశ్వర బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. వరస డిజాస్టర్ లో ఉన్న రాజ్ తరుణ్ కు దిల్ రాజు ఆఫీస్ నుంచి సినిమా రావడం అనేది చిన్న విషయం కాదు.. కానీ వచ్చింది. ఐదేళ్ల కింద సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తెరకెక్కించిన కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా నిర్మించబోతున్నాడు దిల్ రాజు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ గాడిన పడుతుందో పడుతుందో లేదో చూడాలి.

RAJ TARUN MOVIE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here