లాభాల పంట పండిస్తున్న నాని జెర్సీ సినిమా..

రెండు వరుస ఫ్లాపులు వచ్చినా కూడా నాని మార్కెట్ ఎలాంటి దెబ్బ తినలేదు. ఈయన తర్వాత సినిమా జెర్సీపై ఆ ప్రభావం ఏ మాత్రం పడలేదు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ మధ్యే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది చూసిన తర్వాత బిజినెస్ కూడా ఊపందుకుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు రెండు నెలల ముందే బిజినెస్ అంతా హాట్ కేకుల్లా జరుగుతుంది. శాటిలైట్ బిజినెస్ తో పాటు థియేట్రికల్ కూడా రెండు నెలల ముందే క్లోజ్ అయిపోయేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 19న జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

nani jersey telugu movie first look

ఈ సినిమాలో క్రికెటర్ గా నటిస్తున్నాడు నాని. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక టీజర్ విడుదలైన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనాకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు.. ముందు నుంచే ఈ సినిమాపై దృష్టి పెడుతున్నారు. విడుదల సమయానికి రేట్ ఇంకా పెరిగిపోతుందని ఊహించి.. ముందుగానే దక్కించుకోవాలని చూస్తున్నారు. దానికితోడు టీవీ చానల్స్ కూడా శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడుతున్నాయి. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న జెర్సీ విడుదలకు ముందే దాదాపు 35 కోట్ల బిజినెస్ చేస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తానంటున్నాడు నాచురల్ స్టార్. మళ్ళీరావా సినిమా తర్వాత గౌతమ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దాంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి గౌతమ్, నాని కలిసి ఎలాంటి మాయ చేస్తారో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here