రానా ఎన్ని సినిమాలు చేస్తున్నాడు.. ఎప్పుడు విడుదలవుతాయి..

అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే రానా.. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమా తీసుకొని రాలేదు. బాహుబలి తర్వాత నేనే రాజు నేనే మంత్రి, ఘజి సినిమాలతో హీరోగా సక్సెస్ అయ్యాడు రానా.. అయితే అదే కొనసాగించడంలో మాత్రం పూర్తిగా వెనకబడి పోతున్నాడు. చేతిలో అరడజను సినిమాలు ఉన్నా ఒక్కటి కూడా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ఇదే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెడుతోంది.

హాథీ మేరే సాథీ, 1945, హౌస్ ఫుల్ 4 సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు రానా. ఇప్పుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. విరాటపర్వం 1992 సినిమాలో సాయి పల్లవితో కలిసి నటించబోతున్నాడు దగ్గుపాటి వారసుడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది. ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఏది ఎప్పుడు వస్తుందో రానాకు కూడా క్లారిటీ లేదు.. ఇందులో 1945 చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా.. దాంతో దానికి ఇంకా కొద్దిగా టైం పడుతుందంటున్నారు రానా.

సత్య శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాంతోపాటు హౌస్ ఫుల్ 4 సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఇందులో రానా హీరో కాదు. హాథి మేరీ సాథి సినిమా కూడా ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. దాంతో వరస సినిమాలు చేస్తున్నాడు కానీ వాటి విడుదలపై మాత్రం మనసు పెట్టడం లేదు రానా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here