సైరాలో చిరంజీవి కాకుండా  ఆ ఇద్దరు మెగా హీరోలు..

మెగా అభిమానులు సైరా సినిమా కోసం ఇప్పుడు ఎంతగా వేచి చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో పెరిగిన తెలుగు సినిమా స్థాయిని తన సినిమాతో ఇంకాస్త పెంచాలని ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 15 ఏళ్లుగా తాను నటించాలనుకుంటున్న కలల ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితచరిత్ర ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చాలా కష్టపడుతున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సైరా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో రెండు సర్ ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తుంది.

Sye Raa Narasimha Reddy

చిరంజీవి కాకుండా మరో ఇద్దరు మెగా హీరోలు నటించబోతున్నారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ లో హీరో అల్లు అర్జున్.. నిర్మాత రామ్ చరణ్ అతిథి పాత్రలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ కూడా ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వడం లేదు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఇది ఒక పెద్ద సర్ ప్రైజ్. వీరిద్దరితో పాటు అనుష్క కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిందని ప్రచారం జరుగుతోంది. ఈమె పాత్రపై కూడా ఇలాంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి వాళ్ళే కాకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్, అనుష్క లాంటి స్టార్స్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. దసరాకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here