తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కాజల్ సంచలనం..

నీకు అవకాశం ఇవ్వాలంటే మరి నాకు ఏమిస్తావ్.. ఇండస్ట్రీలో ఈ తరహా ధోరణి చాలానే ఉందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. దీనికే మనవాళ్లు క్యాస్టింగ్ కౌచ్ అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అవకాశాల కోసం హీరోయిన్లను పడక గదికి రమ్మని పిలిచే ఒక ప్రక్రియ ఈ క్యాస్టింగ్ కౌచ్. ఇందులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళంతా బయటికి వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడారు.

ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. అప్పుడెప్పుడో ఒకసారి దీనిపై మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదని చెప్పిన చందమామ.. ఇప్పటికీ అదే మాట మీద నిలబడింది. ఇంతవరకు ఎప్పుడూ తనకు అలాంటి పరిస్థితి రాలేదని.. అవకాశాల కోసం పడక గదికి రమ్మని పిలిచేంత అసభ్యంగా తనతో ఎవరు ప్రవర్తించలేదని చెప్పింది కాజల్. ఒక వేళ అలా చేసినా కూడా కాలర్ పట్టుకుని నిలదీసే సత్తా తనకు ఉందంటుంది కాజల్ అగర్వాల్. తన స్నేహితురాలిని ఏడిపించిన ఒకడ్ని ఇలాగే నిలదీసానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అయితే తనకు ఎదురు కాలేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం క్యాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పను అంటుంది కాజల్. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లని పడక గదికి రావాలని కోరే దర్శక నిర్మాతలు ఇంకా ఉన్నారని ఒప్పుకుంది కాజల్ అగర్వాల్. మొత్తానికి ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here