విజ‌య్ సినిమాలో 16 మంది హీరోయిన్లు.. నిజ్జంగా నిజం..

ఒక్క సినిమాలో 16 మంది హీరోయిన్లు ఏంటి స్వామి.. అసలు ఇది నిజమేనా.. అసలు ఒక్క సినిమాలో అంత మంది హీరోయిన్లు ఎలా ఉంటారు.. వాళ్లకు స్క్రీన్ స్పేస్ ఎక్కడ సరిపోతుంది.. ఎవరికి ఎన్ని సీన్లు ఇస్తాడు.. హీరో ఎంత మందితో రొమాన్స్ చేస్తాడు.. అది సాధ్యమయ్యే పనేనా అని అనుమానాలు వస్తున్నాయి. ఒక్క సినిమాలో 16 మంది హీరోయిన్లు ఉన్నారంటేనే న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉంది. కానీ ఇప్పుడు దీన్ని నిజం చేయాల‌ని చూస్తున్నాడు అట్లీకుమార్. ఈయన తెరకెక్కించబోయే సినిమాలో నిజంగానే 16 మంది అమ్మాయిలు నటించబోతున్నారు. క్రీడల నేప‌థ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో విజయ్ లేడీస్ ఫుట్బాల్ టీమ్ కోచ్ గా నటిస్తున్నాడు. జనవరిలోనే షూటింగ్ మొదలు కానుంది. దసరాకు సినిమా విడుదల కానుంది.
vijay atlee new movie
ఇక ఈ సినిమాలో 16 మంది అమ్మాయిల కోసం చూస్తూ.. అందరినీ హీరోయిన్లనే తీసుకోవాలని ఎంచుకోవాల‌ని ట్రై చేస్తున్నాడు అట్లీ కుమార్. ఇదేగాని జరిగితే నిజంగానే ఓ రికార్డు అవుతుంది. ఒకే సినిమాలో ఇంత మంది హీరోయిన్లను నటింపజేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ దాన్ని సాధ్యం చేయాలని చూస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఒలంపిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండ‌బోతుంది.అందులో జరిగే అన్యాయాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు అట్లీకుమార్. దీనికోసం దేశంలో ఉన్న ప్రముఖ క్రీడా నిపుణులతో కూర్చొని కథకి కసరత్తులు చేశాడు అట్లీ. మరి ఇంతమంది నేర్పు తో కలిసి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అన్నింటికంటే ముందు ఒకే సినిమాలో 16 మంది ముద్దుగుమ్మలను ఎలా చూపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here