భార‌తీయుడు 2 షూటింగ్ ఎప్ప‌ట్నుంచి.. అస‌లుందా లేదా..? 

భారతీయుడు 2 సినిమా ప్రకటించి కూడా చాలా రోజులవుతుంది. 2.0 విడుదలకు ముందే ఈ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు శంకర్. కానీ ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కలేదు. మరోవైపు కమల్ హాసన్ కూడా భారతీయుడు కాదని రాజకీయాలతో బిజీ అయిపోయాడు. దాంతో ఈ సినిమా ఇప్పుడు ఉంటుందా ఉండదా అని ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఎక్కువైపోయింది. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసింది. జనవరి 18 నుంచి భారతీయుడు 2 సెట్స్ పైకి వెళ్లనుంది. కాజల్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మర్మ‌క‌ళ‌ నేర్చుకుంది కాజ‌ల్. 20 ఏళ్ల కింద వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ కూడా కథ అదే స్థాయిలో సిద్ధం చేస్తున్నాడు.
ప్రస్తుత రాజకీయాలను టార్గెట్ చేస్తూ భారతీయుడు-2 సిద్ధమవుతోంది.
kamal haasan shankar indian 2
అప్పుడు లంచం గురించి ప్రస్తావిస్తే ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టడానికి చూస్తున్నాడు శంకర్. కొన్నేళ్లుగా కేవలం టెక్నాలజీని మాత్రమే నమ్ముకొని సినిమాలు చేస్తున్న శంకర్ ఈ సారి పూర్తిగా కథను నమ్ముకుని వస్తున్నాడు. మళ్లీ పాత శంకర్ అంటే ఎలా ఉంటాడో చూపిస్తాను వ‌స్తున్నాడు ఈ దర్శకుడు. శివాజీ తర్వాత నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా రాలేదు. రోబో, ఐ, 2.0 లాంటి సినిమాలు టెక్నాలజీని నమ్ముకుని వచ్చాయి. దాంతో ఇప్పుడు మరోసారి సోషల్ మెసేజ్ ఉన్న కథతో రాబోతున్నాడు శంకర్. మరి ఈయన తెరకెక్కించబోయే భారతీయుడు 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అన్నీ కుదిరితే 2019 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here