కృష్ణార్జున యుద్ధం.. ఏంటీ బిజినెస్..?

నాని అంటే ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్. హిట్ సినిమాలు స‌ప్లై చేసే మిష‌న్. ఈయ‌న ఓ క‌థ ఓకే చేస్తే ఇప్పుడు హిట్ అనే అంచ‌నాకు వ‌చ్చారు ప్రేక్ష‌కులు. నిర్మాత‌లు కూడా అంతే. అలాంటి నానిని ఇప్పుడు చిన్న హీరో అంటే ఒప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఈయ‌న కృష్ణార్జున యుద్ధం బిజినెస్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తున్నాయి. ఈ చిత్ర ట్రైల‌ర్ ఇప్ప‌టికే రికార్డ్ వ్యూస్ సాధించింది. నాని ఏదో హిట్ల‌లో ఉన్నాడ‌ని కృష్ణార్జున యుద్ధం సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డం కాదు కానీ ఈ చిత్రానికి మ‌రో స్పెషాలిటీ కూడా ఉంది. ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేసాడు. పైగా వ‌ర‌స విజ‌యాల్లో ఉన్న మేర్ల‌పాక గాంధీ దీనికి ద‌ర్శ‌కుడు.
ఎప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుద‌ల కానుంది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ ధిల్ల‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నానితో ఇద్ద‌రు జోడీ క‌ట్ట‌డం తొలిసారే. ఇప్ప‌టికే న‌టిగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది అనుప‌మ‌. ఈ మ‌ధ్య కాస్త రేస్ లో వెన‌కబ‌డిన‌ట్లు క‌నిపించిన అనుప‌మ‌.. ఇప్పుడు నాని సినిమాతో ఫామ్ లోకి రావాల‌ని చూస్తుంది. పైగా కృష్ణార్జున యుద్ధం ప్రీ రిలీజ్ బిజినెస్ 47 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ఇందులో కేవ‌లం థియెట్రిక‌ల్ బిజినెస్ 35 కోట్లు. అంటే సినిమా హిట్ కావాలంటే క‌చ్చితంగా 35 కోట్లు రావాల‌న్న‌మాట‌. మొత్తానికి ఇప్పుడు నాని దూకుడు చూస్తుంటే ఇంత రావ‌డం క‌ష్ట‌మేం కాదు కానీ సినిమా సినిమాకు కూడా ఇలా రేట్లు పెంచేస్తే బ‌య్య‌ర్ల‌కు క‌ష్ట‌మైపోతుంది క‌దా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here