జై ల‌వ‌కుశ‌ను ఫాలో అవుతున్న స‌మంత‌..


అదేంటి.. జై ల‌వ‌కుశ‌ను స‌మంత ఫాలో కావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అయినా స‌మంత ఎందుకు జై ల‌వ‌కుశ‌ను ఫాలో అవుతుంది అనుకుంటు న్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. ప్ర‌స్తుతం స‌మంత మ‌హాన‌టి సినిమాలో న‌టిస్తుంది. ఇందులో మ‌ధుర‌వాణిగా న‌టిస్తుంది ఈ భామ‌.
జ‌ర్న‌లిస్ట్ పాత్ర ఇది. సావిత్రి జీవితాన్ని ప్రేక్ష‌కుల‌కు చెప్పే పాత్ర ఇది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ కూడా స‌మంత పాత్ర‌తోనే మొద‌లైంది. ఇందులో సావిత్రి గురించి మ‌ధురవాణి చెబుతుంది. అయితే ఇక్క‌డే జై ల‌వ‌కుశ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇందులో స‌మంత పాత్ర‌కు న‌త్తి ఉంటుంది. అక్క‌డ ఎన్టీఆర్ కూడా జై ల‌వ‌కుశ‌లో రావ‌ణ పాత్ర‌ను న‌త్తితో కిరాక్ పుట్టించాడు. ఇప్పుడు స‌మంత కూడా న‌త్తి పాత్ర‌తోనే వ‌స్తుంది.
మ‌ధుర‌వాణి త‌న న‌త్తితోనే సావిత్రి జీవితాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంది. మ‌రి ఈ పాత్ర‌లో మ‌ధుర‌వాణి ఎంత మ‌ధురంగా న‌టించి ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here