తేజ‌తో బాల‌య్యకు మాట‌ల్లేవా..? 


అదేంటి.. క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు..! అందులోనూ అన్న‌గారి బ‌యోపిక్ ను తీసుకెళ్లి ఏరికోరి మ‌రీ తేజ చేతుల్లోనే పెట్టాడు.. అలాంటిది మాట‌లెందుకు ఉండ‌వు అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు తేజ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది మ‌రి. ఎన్టీఆర్ బ‌యోపిక్ అంగ‌రంగ వైభ‌వంగా అతిరథ మ‌హారథుల మ‌ధ్య రామ‌కృష్ణ స్టూడియోస్ లో ఓపెన్ అయింది. బాల‌య్య ఎంచ‌క్కా ధుర్యోధ‌నుడిగా వ‌చ్చి ర‌ప్ఫాడిం చేసాడు. ఇదిలా ఉంటే అంతా అయిపోయింది.. అన్నీ బాగానే జ‌రిగాయి అనుకుంటున్న త‌రుణంలో ఒక్కొక్క‌రు సినిమా గురించి మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు. ఇక్క‌డే అస‌లు చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. బాల‌య్య అంతా బాగానే మాట్లాడాడు కానీ తేజ మాత్రం కాస్త తేడా కొట్టాడు. ఈ చిత్రం తెర‌కెక్కించే స్థాయి త‌న‌ది కాద‌ని.. అయినా కానీ నువ్వే క‌రెక్ట్ అని తీసుకొచ్చి ఈ బాధ్య‌త అప్పగించార‌ని చెప్పాడు తేజ‌. సినిమా బాగా తీయ‌డానికి ట్రై చేస్తా.. త‌ప్పులుంటే మ‌న్నించండి అంటూ బాగానే మాట్లాడాడు తేజ‌.
విడుదల విష‌యంలో మాత్రం బాల‌య్య చెప్పిన మాట‌ల‌కు.. తేజ మాట‌ల‌కు అస్స‌లే పొంత‌న లేదు. ఆగ‌స్ట్ లో షూటింగ్ మొద‌లు పెట్టి.. సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామంటూ ఇదివ‌ర‌కే అనౌన్స్ చేసాడు బాల‌కృష్ణ‌. ఈయ‌న మాట‌లే ఫైన‌ల్ కూడా. ఎందుకంటే ఈ చిత్రానికి ఈయ‌న కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు నిర్మాత కూడా. అలాంట‌ప్పుడు విడుద‌ల విష‌యం కూడా బాల‌య్య‌కే క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు తేజ వ‌చ్చి ద‌స‌రాకు విడుద‌ల ప్లాన్ చేస్తున్నాం అంటూ చెప్పాడు. దాంతో అస‌లేంటీ క‌న్ఫ్యూజ‌న్ అంటూ అభిమానుల్లోనూ తెలియ‌ని గంద‌ర‌గోళం మొద‌లైంది. తేజ‌కు బాగా మొండోడు.. ఎవ‌రి మాటా విన‌డు అనే పేరుంది. బాల‌య్య మాత్రం ద‌ర్శ‌కులు చెప్పిందే వేదం అనుకునే టైప్. మ‌రి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో పెద్దాయ‌న్ని ఏం చేస్తారో చూడాలిక‌..? మ‌రి ఇప్పుడు తేజ చెప్పిన‌ట్లు ద‌స‌రాకే ఎన్టీఆర్ వ‌స్తుందా.. లేదంటే నిర్మాత‌, హీరో బాల‌య్య చెప్పిన‌ట్లు సంక్రాంతికి విడుద‌ల కానుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here