తేజ త‌ప్పుకోడానికి అస‌లు కార‌ణ‌మిదే.. బాల‌య్య క్లారిటీ.. 

ఎన్టీఆర్ బయోపిక్ ఎలాంటి ఆటంకాలు లేకుండా తెరకెక్కింది.. మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఒక సంచలన విషయం బయట పెట్టాడు బాలకృష్ణ. ఈ సినిమాకు ముందు దర్శకుడు క్రిష్ కాదు అనే విషయం చాలామందికి తెలుసు. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు బాలయ్య. ముహూర్తం కూడా పెట్టాడు.. రెగ్యులర్ షూటింగ్ తరువాయి అనుకుంటున్న తరుణంలో తేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ సినిమా గురించి గాసిప్స్ అల్లేశారు. బాలయ్య కూడా ఏ రోజు తేజ ఎందుకు తప్పుకున్నాడు అనే విషయం చెప్పలేదు. వీళ్ళిద్దరి మధ్య విభేదాల కారణంగానే ఆయన తప్పుకొని ఉంటాడని అంతా అనుకున్నారు.
ntr kathanayakudu
తేజ తప్పుకోగానే వెంటనే క్రిష్ సీన్ లోకి రావడంతో నందమూరి అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో తేజ విషయాన్ని మరోసారి చర్చించాడు బాలయ్య. ఆయన తప్పించడానికి వేరే కారణాలు ఏమీ లేవని.. స్వయంగా తేజనే తన దగ్గరికి వచ్చి ఇంత భారాన్ని తాను మోయలేనని చెప్పినందుకే అతడిని తప్పించామ‌ని చెప్పాడు బాల‌య్య‌. ఆ త‌ర్వాత ఈ బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారో అనుకుంటున్న త‌రుణంలో స్వయంగా వచ్చి తానే ఈ బాధ్యత తీసుకుంటాను అని క్రిష్ చెప్పాడని చెప్పాడు బాల‌య్య‌. దాంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా క్రిష్ చేతుల్లో ఈ బయోపిక్ పెట్టేశారని క్లారిటీ ఇచ్చాడు బాలకృష్ణ. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం క్రిష్ ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టి ఉంటాడో అనేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here