తొక్కేసిన సినిమాకే స‌న్మానం.. 


ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటారో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మ‌హాన‌టి చిత్ర‌యూనిట్ కు అల్లు అర‌వింద్ స‌న్మానం చేసాడు. ప్ర‌త్యేకంగా ఈ చిత్ర యూనిట్ ను పిలిపించుకుని ఓ పార్టీ కూడా ఇచ్చాడు. దీనికి రెండు రోజుల ముందు చిరంజీవి కూడా ఇంటికి పిలిపించుకుని మ‌రీ స‌న్మానించాడు. చిరంజీవి స‌న్మానించ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే అశ్వినీద‌త్ తో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం అలాంటిది. కానీ అల్లు అర‌వింద్ స‌న్మానించ‌డం మాత్రం ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఉంది. దానికి కార‌ణం లేక‌పోలేదు.. ఎందుకంటే అల్లు అర్జున్ నా పేరు సూర్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌హాన‌టి కూడా. ఈ చిత్రం కానీ రాక‌పోయుంటే ఎలాగూ ఫ్లాప్ అయింది కానీ మ‌రో 4-5 కోట్లైనా వ‌చ్చుండేది. కానీ రెండో వారంలో మ‌హాన‌టి రావ‌డంతో పూర్తిగా చ‌ల్ల‌బ‌డిపోయాడు సూర్య‌. ఈ చిత్రాన్ని అంత‌గా దెబ్బ‌కొట్టిన అమ్మ‌కు మ‌న‌సారా వంద‌నం చేసారు అల్లుఫ్యామిలీ. ఇది నిజంగా గొప్ప విష‌య‌మే. ఏదేమైనా మంచి సినిమా వ‌చ్చిన‌పుడు ఇండ‌స్ట్రీ అంతా అండ‌గా ఉంటుంద‌ని మ‌హాన‌టి విష‌యంలో మ‌రోసారి ప్రూవ్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here