ప్రిన్స్.. ఖాళీగా ఉన్న‌పుడు పెరిగినా కండ‌లా..?


ప్రిన్స్.. పేరులో ప్రిన్స్ ఉన్నంత మాత్రానా రాజ‌కుమారుడు అయిపోడు. అదృష్టం కూడా ఉండాలి క‌దా..! పాపం కుర్ర హీరో ప్రిన్స్ కు అదే లేదు. తేజ నీకు నాకు డ్యాష్ డ్యాష్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు ప్రిన్స్. ఆ త‌ర్వాత మారుతి బ్రాండ్ లో వ‌చ్చిన బ‌స్టాప్ లో హీరోగా చేసాడు. అది హిట్ అయింది. ఆ వెంట‌నే మారుతి నిర్మాత‌గా చేసిన రొమాన్స్ లో హీరోగా న‌టించాడు. అది కాస్తా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అవ‌కాశాల కోసం మ‌రీ అడ‌ల్ట్ కామెడీస్ లో న‌టించ‌డంతో ప్రిన్స్ రేంజ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. ఆ త‌ర్వాత మొన్న బిగ్ బాస్ తొలి సీజ‌న్ లో ఆల్మోస్ట్ ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చాడు ఈ హీరో. కానీ అవేవీ ఈ హీరోకు పెద్ద‌గా అవ‌కాశాలు తీసుకురావ‌డం లేదు.
ప్రిన్స్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే సంగ‌తే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రికీ గుర్తులేదు. అందుకే త‌న‌ను తాను కొత్త‌గా ప‌రిచ‌యం చేసుకుంటున్నాడు ప్రిన్స్. ఆ మ‌ధ్య రామ్ న‌టించిన నేను శైల‌జ‌లో హీరోయిన్ కు అన్న‌య్య‌గా న‌టించాడు ప్రిన్స్. అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో.. అప్పుడే అన్నైపోయాడు ఈ కుర్ర హీరో. ఈ కారెక్టర్ ఒప్పుకోవ‌డం అంటే ఇక‌పై కూడా తాను కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించ‌డానికి సిద్ధ‌మంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు సందేశాన్ని పాస్ చేయ‌డ‌మే. ఇక ఇప్పుడు కూడా అడ‌పాద‌డ‌పా రోల్స్ తోనే ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉండ‌కుండా.. ఆ స‌మ‌యంలో కండ‌లు పెంచేసాడు ప్రిన్సి. మొత్తానికి హీరోగా క్రేజ్ లేద‌నుకున్న‌పుడు.. క్రేజ్ వ‌చ్చే పాత్ర‌ల వెంటే మ‌నం ప‌రిగెత్తాల‌నే విష‌యాన్ని త్వ‌ర‌గానే గ్ర‌హించాడు ప్రిన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here