మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ `తొలిప్రేమ` టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రానికి `తొలి ప్రేమ‌` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడువెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా…
నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంఇ. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఓ క్యూట్ అండ్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించారు.వ‌రుణ్ తేజ్‌ను స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లోప్రేక్ష‌కులు చూడటం ఖాయం. `తొలిప్రేమ‌` అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునే బ్యూటీఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ డిసెంబ‌ర్ నెల‌లో షూటింగ్ పూర్త‌వుతుంది. జ‌న‌వ‌రిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌నుపూర్తి చేస్తాం. ఫిబ్ర‌వరి 9న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించ‌గా, జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here