ర‌ష్మిక‌.. పిల్ల మాయ చేస్తుంద‌బ్బా..!


అదేం విచిత్రమో కానీ కొంద‌రు హీరోయిన్లు వ‌చ్చీ రావ‌డంతోనే గుండెల్లో గంట‌లు మోగిస్తుంటారు. చూడ్డానికి అంత అందంగా ఉండ‌క‌పోయినా.. కేవ‌లం త‌మ ఎక్స్ ప్రెష‌న్స్ తో మాయ చేస్తుంటారు. సాయిప‌ల్ల‌వి ఇలా మాయ చేసిన బ్యూటీనే. ఇక ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న కూడా ఇదే లిస్ట్ లోకి వ‌స్తుంది. క‌న్న‌డ‌లో గ‌తేడాది కిరిక్ పార్టీ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ర‌ష్మిక‌. ఈ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించింది.
ఈ చిత్ర షూటింగ్ న‌డుస్తున్న స‌మ‌యంలోనే హీరో క‌మ్ డైరెక్ట‌ర్ రక్షిత్ శెట్టి తో ప్రేమలో ప‌డిపోయింది. త్వ‌ర‌లోనే ఈయ‌న్ని పెళ్లి కూడా చేసుకోబోతుంది ర‌ష్మిక‌. ఇదిలా ఉండ‌గానే తెలుగులో కెరీర్ కూడా బాగానే ప్లాన్ చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఇక్క‌డ నాగ‌శౌర్య‌తో న‌టించిన ఛ‌లో విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో అమ్మ‌డి యాక్టింగ్ కు కుర్రాళ్ళతో పాటు ద‌ర్శ‌కులు, హీరోలు కూడా ఫిదా అయిపోయారు.
ముఖ్యంగా ర‌ష్మిక క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు విడుద‌లైన గీత‌గోవిందం పాట‌లో కూడా స‌న్న‌గా న‌డుము చూపించి వేడి పెంచేసింది ర‌ష్మిక‌. విజ‌య్ దేవ‌ర కొండ‌తో ఈ సినిమాలో రొమాన్స్ చేస్తుంది ర‌ష్మిక‌. దాంతో పాటు నానితో దేవ‌దాసు.. విజ‌య్ తోనే డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు చేస్తుంది ఈ భామ‌. వ‌ర‌స సినిమాల‌తో తెలుగులోకి చాలా సైలెంట్ గా వ‌చ్చేసింది ఈ కిర్రాక్ హీరోయిన్. మ‌రి టాలీవుడ్ లో ర‌ష్మిక‌ మాయ ఎంత‌వ‌ర‌కు కొన‌సాగుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here