ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఎన్టీఆర్ లేడు.. కార‌ణం ఏంటంటే.. 

చారిత్రాత్మక సినిమాలు అప్పుడప్పుడే వస్తుంటాయి. అందులో నటించాలని అందరికీ ఉంటుంది.. ఎన్టీఆర్ బయోపిక్ కూడా అలాంటి చిత్రమే. ఈ సినిమాలో ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్రముఖులు నటించారు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎంతమంది ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ లేడు అనే బాధ నందమూరి అభిమానుల్లో కనిపిస్తోంది. బాలయ్యతో ఉన్న విభేదాల కారణంగానే జూనియర్ ను ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దూరంగా పెట్టారని వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న‌య్య‌ కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు దూరం పెట్టలేదని ఇందులో ఎన్టీఆర్ పోషించే పాత్ర ఏదీ లేదని.. అందుకే అతన్ని తీసుకోలేదని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్.

NTR Biopic Pre Release Event Photos Set 2 (5)
అంతేకాని బాలయ్య, ఎన్టీఆర్ మధ్య అంతా అనుకుంటున్నట్లు ఎలాంటి విభేదాలు కానీ వివాదాలు కానీ లేవని క్లారిటీ ఇచ్చాడు నందమూరి వారసుడు. కేవలం బాబాయ్ పిలిచాడు ఒకే ఒక్క కారణంతో ఇంకేమీ ఆలోచించకుండా కథానాయకుడు ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడన్న సంగతి గుర్తు చేశాడు కళ్యాణ్ రామ్. నందమూరి కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను ఒక చిన్న పాత్రకు పరిమితం చేస్తే అభిమానులు నిరాశ పడతార‌నే కారణంతోనే అతన్ని బయోపిక్ లోకి తీసుకోలేదని చెప్పాడు కళ్యాణ్ రామ్. మరి ఈయన చెప్పిన సమాధానంతో నందమూరి అభిమానులు తృప్తి పడతారా లేదా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here