ఎఫ్2 ఎందుకో సంక్రాంతి స్పెష‌ల్ ప్యాకేజ్ అనిపిస్తుందే..

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా ఎందుకో తెలియదు కానీ ఎఫ్2 సినిమాపై ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పండగ సినిమాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఈ చిత్రానికి ఉన్నాయంటున్నారు. దానికి కారణం సినిమాలో ఎంటర్టైన్మెంట్.

అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ట్రైలర్ చూస్తుంటే అర్ధం అయిపోతుంది. రెండు నిమిషాలు ట్రైలర్లోనే కళ్లలో నీళ్లు వచ్చేంతగా నవ్వించాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ సినిమాలో ఏ స్థాయి నవ్వులు ఉండబోతున్నాయనేది ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. దానికి తోడు వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కామెడీ సినిమా చేశాడు. ఇది కూడా అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది.

f2 fun and frustration trailer
f2 fun and frustration trailer

ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫ్2 వైపు రావడానికి వెంకటేష్ అనే ఒక్క‌ పేరు చాలు. దిల్ రాజు కూడా ఈ సినిమాకు కావాల్సినన్ని థియేటర్లు పక్కన పెట్టాడు. ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా ఈ సినిమాకు థియేటర్ల విషయంలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దానికితోడు సంక్రాంతి పండక్కి చివరగా వస్తున్న సినిమా కావడం కూడా ఎఫ్2కు కలిసిరానుంది. అప్పటికే అన్ని సినిమాలు వచ్చి ఉంటాయి.. అన్ని సినిమాల టాక్స్ తెలిసి ఉంటాయి.. దాంతో ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా బంపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలిక ఇన్ని అనుకూలతలను వెంకటేష్, వరుణ్ తేజ్ ఎంతవరకు వాడుకుంటారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here